Privatization: దేశంలో కొనసాగుతున్న ప్రైవేటీకరణ, టాటా చేతికి చిక్కిన మరో ప్రభుత్వ కంపెనీ

Privatization: దేశంలో ప్రైవేటీకరణ వేగమందుకుంది. మరో ప్రభుత్వ కంపెనీ ప్రైవేట్ చేతికి చిక్కింది. ప్రముఖ ఉక్కు కంపెనీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూప్ చేతికి చిక్కిన ఈ కంపెనీ వాస్తవానికి గత రెండున్నరేళ్లుగా మూసివేసుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2022, 11:04 PM IST
Privatization: దేశంలో కొనసాగుతున్న ప్రైవేటీకరణ, టాటా చేతికి చిక్కిన మరో ప్రభుత్వ కంపెనీ

Privatization: దేశంలో ప్రైవేటీకరణ వేగమందుకుంది. మరో ప్రభుత్వ కంపెనీ ప్రైవేట్ చేతికి చిక్కింది. ప్రముఖ ఉక్కు కంపెనీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూప్ చేతికి చిక్కిన ఈ కంపెనీ వాస్తవానికి గత రెండున్నరేళ్లుగా మూసివేసుంది. 

దేశంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నా మరో పెద్ద కంపెనీ ప్రైవేట్ చేతికి చిక్కింది. ఒడిశాకు చెందిన ప్రముఖ కంపెనీ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా కొనుగోలు చేశారు. నష్టాల్లో కూరుకుపోయిన కారణంగా..మార్చ్ 30, 2020 నుంచే ఈ కంపెనీ మూతపడి ఉంది. ఇప్పుడీ కంపెనీని టాటా గ్రూప్ వశం చేసుకుంది. జూలై నాటికి ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కానుంది. టాటా స్టీల్ ఈ కంపెనీని 12 వేల 100 కోట్లకు నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీలో 93.7 శాతం వాటాను కొనుగోలు చేసింది. టాటా స్టీల్‌తో పాటు పోటీగా జిందాల్ స్టీల్, నల్వా స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌లు టెండర్ వేశాయి. టెండర్‌లో ఈ కంపెనీ టాటా చేతికి చిక్కింది. 

లావాదేవీలు చివరి దశలో ఉన్నాయని..వచ్చే నెల వరకూ సంతకాలు కూడా పూర్తవుతాయని తెలుస్తోంది. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఒడిశాలోని కళింగనగర్‌లో 1.1 మెట్రిక్ టన్స్ సామర్ధ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇది. ఈ ప్రభుత్వ కంపెనీ పెను నష్టాల్లో నడుస్తోంది. ఈ ప్లాంట్ 2020, మార్చ్ 30 నుంచి మూతపడి ఉంది. కంపెనీకు 2021 మార్చ్ 31 నాటికి 6 వేల 6 లవందల కోట్ల కంటే ఎక్కువ అప్పు ఉంది. ఇందులో ప్రమోటర్ల వాటా 4 వేల 116 కోట్లు, బ్యాంకులకు 1741 కోట్ల రూపాయలు, సిబ్బందికి బకాయిలు ఉన్నాయి.

Also read: Aadhaar Update News: నిలిచిపోయిన ఆధార్ కార్డు రెండు కీలక సేవలు, ఇక అడ్రస్ అప్‌డేట్ కష్టమేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News