Post Office Scheme 2023: ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెడితే డబుల్ బెనిఫిట్స్

National Savings Certificate Scheme: తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల కోసం చూస్తున్నవారికి మంచి అవకాశం. మీ డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా..    

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 01:10 PM IST
Post Office Scheme 2023: ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెడితే డబుల్ బెనిఫిట్స్

National Savings Certificate Scheme: మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా..? మీ డబ్బు సేఫ్‌గా ఉండి.. మంచి ఆదాయం రావాలని భావిస్తున్నారా..? అయితే పోస్టాఫీసు స్కీమ్‌లో మీకు ఓ మంచి పథకం ఉంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు. ఈ పథకం పేరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్. మీరు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. స్కీమ్ ప్రయోజనాలను కచ్చితంగా తెలుసుకోండి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీస పరిమితి కూడా చాలా తక్కువ. మీరు కేవలం రూ.1,000 డిపాజిట్ చేయడం ద్వారా కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. 

మీరు జీరో రిస్క్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ చాలా మంచి ఎంపిక. ఈ పోస్టాఫీసు పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు కనీసం ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత.. మీ డబ్బును ఐదేళ్ల తర్వాత మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం 6.8 శాతం వడ్డీని అందజేస్తున్నారు. ఇందులో మూడు విధాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. 

==> ఒకే రకంలో మీరు మీ కోసం లేదా మైనర్ కోసం పెట్టుబడి పెట్టవచ్చు. 

==> జాయింట్ ఎ టైప్-ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. 

==> జాయింట్ బి టైప్: ఇద్దరు వ్యక్తులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ మెచ్యూరిటీ తర్వాత డబ్బు కేవలం ఒక పెట్టుబడిదారుడికి మాత్రమే అందుతుంది. 
  
ఇది పొదుపు బాండ్ పథకం. ప్రధానంగా చిన్న, మధ్య ఆదాయ పెట్టుబడిదారులు, ఆదాయపు పన్ను మినహాయింపునకు అర్హులైన వారికి ఉపయోగకరంగా ఉంటుంది. పన్ను ఆదా చేయడంతోపాటు స్థిరమైన వడ్డీని కూడా పొందవచ్చు. ఇందులో హామీ వడ్డీ లభించడంతోపాటు పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పీపీఎఫ్ పథకం మాదిరి కాకుండా.. ఇందులో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి లిమిట్ లేదు. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు. కనీస పెట్టుబడి మొత్తాన్ని రూ.100 డినామినేషన్లతో పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ పథకం కింద తెరిచిన ఖాతాల సంఖ్యపై పరిమితి లేదు. డిపాజిట్ మొత్తం ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కిందకు వస్తుంది. 

Also Read: Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. టూంబ్స్ కూల్చేస్తాం..

Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News