RD vs SIP: రికరింగ్ డిపాజిట్ లేదా ఎస్ఐపీ ఏది మంచిది, రెండింట్లో కలిగే లాభనష్టాలు ఇలా

RD vs SIP: భవిష్యత్ కోసం చాలామంది చాలా రకాలుగా సేవింగ్స్ చేస్తుంటారు. కొందరు రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడుతుంటే ఇంకొందరు సిప్ అంటే సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌పై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే రెండింట్లో ఏది ఉత్తమం అనేది ఎలా తెలుసుకోవడం. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 27, 2023, 08:50 PM IST
RD vs SIP: రికరింగ్ డిపాజిట్ లేదా ఎస్ఐపీ ఏది మంచిది, రెండింట్లో కలిగే లాభనష్టాలు ఇలా

RD vs SIP: ప్రతి నెలా 5000 రూపాయలు పెట్టుబడి పెట్టే ఆలోచన ఉండి ఎందులో ఏ ప్రభుత్వ పధకంలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక లేదా ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే మీకిదే మా సమాధానం. ఇందులో సందేహం అవసరం లేదు. పోస్టాఫీసు రికరిండ్ డిపాజిట్ లేదా సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే సిప్ రెండింట్లో ఏది సరైందో పరిశీలిద్దాం.

రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ ఎంత

పోస్టాఫీసు ఆర్డీపై ప్రస్తుతం 6.5 శాతం వడ్డీ లభిస్తోంది. రికరింగ్ డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పధకాల్లో పెట్టుబడికి ఆసక్తిగా ఉంటే ఇందులో గ్యారంటీ రిటర్న్ లభిస్తుందా లేదా, ఎస్ఐపీలో వడ్డీ ఎంత వస్తుందనేది వివరంగా పరిశీలిద్దాం..

ఒకవేళ మీరు పోస్టాఫీసులో 5000 రూపాయలు ఆర్డీ చేస్తే ఏడాదిలో 60 వేల రూపాయలు జమ అవుతాయి. 5 ఏళ్లలో 3 లక్షల రూపాయలవుతుంది. దీనిపై 6.5 వడ్డీ చొప్పున లాభం లెక్కేసుకుంటే 54,957 రూపాయలు ఉంటుంది. అంటే మెచ్యూరిటీ అయ్యాక మీకు చేతికందే డబ్బులు 3,54,957 రూపాయలు. 

ఎస్ఐపీలో లాభం ఎంత

అదే పోస్టాఫీసు ఆర్డీ కాకుండా ఎస్ఐపీ తీసుకుంటే మొత్తం పెట్టుబడి 3 లక్షలవుతుంది. దీనిపై రిటర్న్ షేర్ అనేది మార్కెట్‌ను బట్టి ఉంటుంది. ఎస్ఐపీపై సాధారణంగా లభించే రిటర్న్ 12 శాతం ఉంటుంది. అంటే 3 లక్షలపై మీకు 1,12,432 రూపాయలు లభిస్తాయి. అంటే ఐదేళ్లకు 4,12,432 రూపాయలు చేతికి అందుతాయి. అయితే ఎస్ఐపీలో రిటర్న్ ఎంతనేది ఫిక్స్డ్‌గా ఉండదు. పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మార్కెట్ రిటర్న్ లెక్కల ప్రకారం 14 నుంచి 18 శాతం ఉండవచ్చు. ఈ లెక్కన ఆర్డీతో పోలిస్తే ఎస్ఐపీ మంచి ఆప్షన్. అయితే ఇందులో రిస్క్ తప్పకుండా ఉంటుంది. 

ఆర్డీ ప్రయోజనాలు

నెల నెలా కొద్దిగా పెట్టుబడి పెట్టాలనుకుంటే..ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఆర్డీ లేదా ఎస్ఐపీ మంచి ప్రత్యామ్నాయం. ఈ రెండు పథకాల్లో ప్రతి నెలా కొద్దిగా ఫిక్స్డ్ నగదు జమ చేయాల్సి ఉంటుంది. ఆర్డీ మెచ్యూరిటీ పూర్తయ్యాక జమ చేసిన నగదుతో పాటు వడ్డీ కూడా చేతికి అందుతుంది. 

Also read: Kia Seltos: హ్యుండయ్ క్రెటా ధరకే అత్యద్బుతమైన ఫీచర్లతో కియా సెల్టోస్, అదనపు ఫీచర్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News