PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధిలో కీలక మార్పులు, 13వ వాయిదా నిలిచే ప్రమాదముంది జాగ్రత్త

PM Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజనలో కొన్ని కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. మీ 13వ విడత డబ్బులు రావల్సి ఉంటే..ఈ మార్పులు పరిశీలించాల్సిందే

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 3, 2022, 04:36 PM IST
PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధిలో కీలక మార్పులు, 13వ వాయిదా నిలిచే ప్రమాదముంది జాగ్రత్త

ప్రధానమంత్రి కిసాన్  సమ్మాన్ నిధి యోజనలో ఇప్పటి వరకూ 12 వాయిదాల చెల్లింపు పూర్తయింది. ఇప్పుడు 13వ విడత చెల్లింపుకు ముందు కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులకు 13వ విడత డబ్బులకు సంబంధముందా..అసలేం జరిగింది..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా ఇప్పటి వరకూ 12 విడత చెల్లింపులు జరిగాయి. రైతుల ఖాతాల్లో నేరుగా 12వ విడత డబ్బులు 2 వేల రూపాయలు చెల్లింపు మొదలైంది. ఇప్పుడిక 13వ విడత కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పధకంలో కీలకమైన మార్పులు జరిగాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

పీఎం కిసాన్ యోజన ప్రారంభంలో సాగుయోగ్యమైన భూమి 2 హెక్టార్లు లేదా 5 ఎకరాలున్నరైతుల్నించి వివరాలు కోరేవారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ నిబంధన తొలగించడంతో 14.5 కోట్ల రైతులకు ప్రయోజనం కలగనుంది. 

ఆధార్ కార్డు తప్పనిసరి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇక ఆధార్ కార్డు ఉన్న రైతులకే వర్తించనుంది. ఆధార్ లేకుండా ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. 

రిజిస్ట్రేషన్ సౌకర్యం

ఈ పథకం సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రయోజనం పొందేందుకు మోదీ ప్రభుత్వం కాగితాలు, ఇతరత్రా వాటికోసం ఆఫీసుల చుట్టూ , అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చేసింది. ఇప్పుుడ రైతులు ఇంట్లో కూర్చునే హాయిగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వద్ద మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ వంటి వివరాలుంటే..pmkisan.nic.in వెబ్‌సైట్‌లో ఫార్మర్స్ కార్నర్‌లో సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. దాంతోపాటు ఏదైనా తప్పిదం జరిగితే సరిదిద్దవచ్చు.

ప్రభుత్వం రైతుల ప్రయోజనార్దం అత్యంత కీలకమైన మార్పు చేసింది. రిజిస్ట్రేషన్ తరువాత మీ స్టేటస్ స్వయంగా తెలుసుకునే అవకాశం కల్పించింది. మీ దరఖాస్తు స్టేటస్ స్వయంగా చెక్ చేయవచ్చు. మీ బ్యాంక్ ఎక్కౌంట్‌లో వాయిదా మొత్తం ఎంత వచ్చిందనే వివరాలు తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌పై వెళ్లి ఏ రైతు అయినా ..స్టేటస్ చెక్ చేయవచ్చు.

ఈ స్కీమ్‌లో ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా చేర్చారు. పీఎం కిసాన్ లబ్దిదారులు సులభంగా కేసీసీ తయారు చేసుకోవచ్చు. కేసీసీపై 4 శాతం చొప్పున 3 లక్షల వరకూ రుణం కూడా లభిస్తుంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ది పొందే రైతులకు ఇప్పుడు పీఎం కిసాన్ మానధన యోజన కోసం ఏ విధమైన కాగితాలు అవసరం లేదు. ఈ పథకంలో రైతులకు అన్నివిధాలుగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం.

కిసాన్ పథకం ప్రకారం ఇప్పుడు లబ్దిదారులు రేషన్ కార్డు కలిగి ఉండటం అనివార్యమైంది. అంటే ఇప్పుడిక అప్లికేషన్‌లో రేషన్ కార్డు వివరాలు సమర్పించిన రైతులకే కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ది చేకూరనుంది.

ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేవైసీ తప్పనిసరిగా మారింది. మీరు కేవైసీ చేయించకపోతే..వెంటనే చేయడం మంచిది.

Also read: Airtel plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌తో ఎయిర్‌టెల్ ఏడాది ప్లాన్ కేవలం 1799 రూపాయలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News