Petrol Price Today: వరుసగా రెండోరోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధర, లేటెస్ట్ రేట్లు ఇలా

Petrol Price Today In Hyderabad 25 February 2021: రెండు రోజుల కిందటి ధరలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగనున్నాయి.  ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది మూడోసారి కావడం గమనార్హం. 

Written by - Shankar Dukanam | Last Updated : Feb 25, 2021, 09:39 AM IST
Petrol Price Today: వరుసగా రెండోరోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధర, లేటెస్ట్ రేట్లు ఇలా

Petrol Price Today In Hyderabad 25 February 2021: చమురు ధరలు వరుసగా రెండోరోజు వాహనదారులకు స్వల్ప ఊరట కలిగించాయి. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజుల కిందటి ధరలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగనున్నాయి.  ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది మూడోసారి కావడం గమనార్హం. 

ఫిబ్రవరి నెలలో ఇదివరకే 14 రోజులు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఫిబ్రవరి 25 (గురువారం) నాడు మంగళవారం నాటి ధరలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం తాజాగా ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో గురువారం ఉదయం పెట్రోల్ ధర లీటర్‌ రూ.94.54, డీజిల్ ధర రూ.88.69 వద్ద కొనసాగుతున్నాయి.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర తాజాగా రూ.90.93 అయింది. 91 రూపాయలకు కేవలం 7 పైసలు దూరంలో నిలవడం తెలిసిందే. డీజిల్ ధర రూ.81.32 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ సెంచరీకి చేరువైంది. ముంబైలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 97.34కి చేరగా, డీజిల్ ధర రూ.88.44 అయింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.92.90, డీజిల్ ధర రూ.86.31 వద్ద ఉంది.

Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ.32.98, అమ్మకం పన్ను లేదా వ్యాట్‌ రూ.19.55గా విధించారు. డీజిల్‌పై రూ.31.33, VAT రూ.10.99, డీలర్ కమిషన్ లీటర్‌కు రూ.2.6, డీజిల్‌పై రూ.2గా కొనసాగుతోంది. రోజువారీగా ఇంధన ధరలలో మార్పులు జరుగుతాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News