Petrol Diesel Price Today: గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పెట్రో బాదుడు రెండు రోజులుగా శాంతించింది. గడిచిన 18 రోజుల్లో 14 సార్లు పెంపుతో పెట్రోల్, డీజిల్ పై రూ. 10 కంటే ఎక్కువ భారం కలిగింది. రెండు రోజులుగా దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41.. డీజిల్ రేటు ప్రస్తుతం రూ. 96.67గా ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ను రూ. 120.51కి విక్రయిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 104 వద్ద ఉంది.
చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 110.95 ఉండగా.. డీజిల్ ధర లీటర్ కు రూ. 101.04 వద్దకు చేరుకుంది. కోల్ కతా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.12గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99.83 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
తెలంగాణలోని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల ధర రూ. 119.49 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 105.49గా కొనసాగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 121.44గా ఉంది. డీజిల్ ధర లీటర్ కు రూ. 107.04 చొప్పున విక్రయిస్తున్నారు.
Also Read: EPF Interest Credit: EPFO ఖాతాలో వడ్డీ ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి ఇలా చేయండి!
Also Read: Old Currency Sale: ఈ పాత కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook