Paytm Name Changed: పేరు మార్చుకున్న పేటీఎం, ఫిబ్రవరి 29 తరువాత Pai ఇ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్

Paytm Name Changed: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు , పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపధ్యంలో చర్చనీయాంశంగా మారిన పేటీఎం నుంచి మరో కొత్త అప్‌డేట్ ఇంది. పేటీఎం పేరు మార్చుకోనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2024, 02:06 PM IST
Paytm Name Changed: పేరు మార్చుకున్న పేటీఎం, ఫిబ్రవరి 29 తరువాత  Pai ఇ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్

Paytm Name Changed: ప్రముఖ యూపీఐ యాప్ పేటీఎం పేరు మార్చుకుంది. PAI ప్లాట్‌ ఫామ్‌గా మారనుంది. ఇప్పటికే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ పేరు మారింది. ఇటీవలే అంటే ఫిబ్రవరి 8న అనుమతి పొందింది. పేటీఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాస్తా ఇక పై ప్లాట్‌ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. పేటీఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విలీం చేయబడింది. ఓఎన్డీసీలో విక్రేత ప్లాట్‌ఫామ్ అయిన Bitsilaను పేటీఎం కొనుగోలు చేసింది. పేటీఎం ఇప్పుడు పై ప్లాట్‌ఫామ్‌గా మారనుంది. 

2020లో ప్రారంభమైన బిట్సిలా ప్రస్తుతానికి ఓఎన్డీసీలో విక్రేతగా పనిచేస్తోంది. పేటీఎంలో అతిపెద్ద భాగస్వామి ఎలివేషన్ కేపిటల్. ఆర్బీఐ ఆంక్షల నేపధ్యంలో ఇటీవల పేటీఎం షేర్లు గణనీయంగా పడిపోయాయి. ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం పరిస్థితి ఏంటనే ఆందోళన పెరిగిపోయింది. ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం విషయంలో ఆర్బీఐ నిర్ణయంలో మార్పు లేకపోతే ఇక పేరు మారడం ఖాయమే. అలా చేయడం ద్వారానే ఇప్పుడున్న కస్టమర్లు, షేర్లను నిలుపుకోవచ్చు. లేకపోతే మరింత నష్టం ఎదురయ్యే అవకాశముంది. 

పేటీఎంలో జరిగిన అవకతవకలు సాధారణంగా చాలా సంస్థల్లో జరిగేవే. కానీ ఆర్బీఐ ఈ వ్యవహారాన్ని భూతద్దంలో చూసి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడం, ఆంక్షలు విధించడంతో ఆ సంస్థ షేర్లు పడిపోతున్నాయి. రెగ్యులేటరీ నిబంధనల నిర్లక్ష్యం కారణంతో  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం సంస్థపై ఆంక్షలు విధించింది. పేటీఎం ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా నిబంధనలు పెట్టింది. అంటే ఇకపై పేటీఎం బ్యాంక్ పనిచేయదు. పేటీఎం వ్యాలెట్ తిరిగి భర్తీ చేసేందుకు ఉండదు. పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదు. ఇలా చాలా రకాల అంశాలు ప్రభావితం కానున్నాయి. ఈ ఆంక్షల నేపధ్యంలో ఆ సంస్థలో గందరగోళం ఏర్పడింది. షేర్ మార్కెట్‌లో పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోతున్నాయి. 

Also read: IPL 2024: ముంబై ఇండియన్స్‌ను వీడనున్న రోహిత్ శర్మ, కారణం అదేనా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News