Pan Card Updates: మీ పాన్ కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం, ఏం చేయాలి

Pan Card Updates: పాన్ కార్డు ఇటీవలి కాలంలో ఇదొక అత్యవసర డాక్యుమెంట్‌గా మారుతోంది. ముఖ్యంగా నిర్దిష్టమైన ఆర్ధిక లావాదేవీలకు తప్పనిసరి. భవిష్యత్‌లో పాన్ కార్డు సైతం ఆధార్ కార్డులా మ్యాండేటరీ కావచ్చు. అంత ముఖ్యమైన పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయా..ఏం చేయాలి

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2023, 09:03 PM IST
 Pan Card Updates: మీ పాన్ కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం, ఏం చేయాలి

Pan Card Updates: దేశంలో ఇప్పుడు పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్‌గా మారింది. పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డు దుర్వినియోగం సహజమే. మీ పాన్ కార్డు దుర్వినియోగమవుతోందని అనుమానాలుంటే కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.

పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ ఎక్కౌంట్ తరచూ చెక్ చేస్తుండాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్, బిల్స్ వంటివి పరిశీలిస్తుండాలి. ఏదైనా తప్పుడు లావాదేవీ జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దేశంలో ఆర్ధిక లావాదేవీలు పెరగడంతో పాన్ కార్డు అవసరం ఎక్కువైంది. పాన్ కార్డు అనేది ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంటుంది. కొన్ని కీలకమైన పనుల కోసం పాన్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తుంటుంది. అంటే మీ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశమున్నట్టే. మరి మీ పాన్ కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం. దీనికి కొన్ని పద్థతులు సూచిస్తున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.

మీ పాన్ కార్డు తప్పుగా దుర్వినియోగమైనట్టు అనుమానముంటే కొన్ని విషయాల ద్వారా చెక్ చేసుకోవచ్చు. తరచూ బ్యాంక్ స్టేట్‌మెంట్, బిల్స్ వంటివి పరిశీలించడం చేస్తుండాలి. మీకు తెలియకుండా ఏదైనా ఆర్ధికపరమైన లావాదేవీ జరిగిందో లేదో పరిశీలించుకోవాలి. దీంతోపాటు సిబిల్ స్కోర్ కూడా తరచూ చెక్ చేయడం మంచిది. ఎందుకంటే పాన్ కార్డు ఎంట్రీ ద్వారానే సిబిల్ స్కోర్‌లో ప్రతీది నమోదవుతుంది. మీరు తీసుకునే రుణాలు, క్రెడిట్ కార్డు వంటివాటి వివరాలు సిబిల్ స్కోర్‌లో ఉంటాయి. దీనిద్వారా మీ పాన్ కార్డు ద్వారా ఎవరైనా లోన్ తీసుకున్నదీ లేనిదీ తెలిసిపోతుంది. అదే సమయంలో ఇన్‌కంటాక్స్ ఎక్కౌంట్ కూడా చెక్ చేయాలి.

ఒకవేళ మీ పాన్ కార్డు పేరుతో ఎక్కడైనా ఏదైనా మీకు సంబంధం లేని లావాదేవీ కన్పిస్తే..తక్షణం బ్యాంకుకు సమాచారమివ్వాలి. అదే సమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వాలి. పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు చేయవచ్చు. మరోవైపు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌కు కూడా తగిన సమాచారమివ్వాలి. మీరిచ్చే ఫిర్యాదు మేరకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకుంటాయి.

Also read: Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం రేటు.. మహిళలకు పెద్ద గుడ్ న్యూస్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News