OnePlus working on a foldable phone, It is Similar to Oppo Find N: ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం వన్ ప్లస్.. ఒప్పోతో విలీనం అవుతున్నట్లు గత సంవత్సరం జూన్‌లో వెల్లడించాయి. ఈ రెండు టెక్ కంపెనీల కలయికతో ఓ తొలి ఫోన్ తీసుకొస్తున్నట్లు గతంలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. టెక్ సంస్థ వన్ ప్లస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విలీనం అనంతరం వన్‌ప్లస్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ తీసుకురావడం గమనర్హం. అయితే వన్‌ప్లస్ ఈ సంవత్సరంలో ఐదు అదనపు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వన్ ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకురావడానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ వెల్లడించింది.
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై ఇప్పటికే పనులు ప్రారభించామని వన్ ప్లస్ సంస్థ తెలిపింది. ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ నెలలోనే భారత్ సహా ఇతర దేశాల్లో వన్ ప్లస్ 10 ప్రోని వన్ ప్లస్ విడుదల చేసింది. వన్ ప్లస్ ఫోల్డబుల్‌లో ఒప్పో ఫైండ్ ఎన్లో ఉన్న ఫీచర్లు, ఆప్షన్లు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది. వన్‌ప్లస్ 10 ప్రో స్నాప్‌డ్రాగన్ 8, Hassleblad-బ్రాండెడ్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, ఇతర ఫీచర్లతో 2022లో అందుబాటులోకి వచ్చింది.
ఒప్పో ఫైండ్ ఎన్ ఫోన్లో 7.1 అంగుళాల ఇన్నర్ డిస్ప్లేతో పాటు రిఫ్రెష్‌రేటు 120 హెర్జ్‌తో స్కాట్ యూటీజీ గ్లాస్ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. అలాగే ఈ ఫోన్లో 60 హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో 5.49 అంగుళాల ఔటర్ డిస్ప్లేను అమర్చారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 చిప్ సెట్‌ను వాడారు. ఈ మొబయిల్లో స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 1 చిప్ సెట్‌ను కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. 3.1 యూఎఫ్ఎస్ స్టోరేజీ సామర్థ్యం ఉండేలా ఈ ఫోన్‌ను తీసురానున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా ఫిక్సల్‌తో కెమెరాను అమర్చారు. ఈ ఫోన్లో 16 మెగా ఫిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్, టెలీఫొటో 13 మెగా ఫిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా 32 ఎంపీ ఇచ్చారు. ఇక బ్యాటరీ సామర్థ్య విషయానికి వస్తే 4,500 MAH ఇచ్చారు. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
Also Read: Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్ ఖాతాలో చెత్త రికార్డు.. లీగ్ చరిత్రలోనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook