Ola Electric developing electric motorcycles: విద్యుత్ ఈ-స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను (Ola electrice e-scooters) లాంఛ్ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లపై దృష్టి సారించింది.
ఎలక్ట్రిక్ మోటార్ (Ola Electrice e-bikes) సైకిళ్లను, బడ్జెట్ ధరలో స్కూటర్లను తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపక సీఈఓ భవీశ్ అగర్వాల్ ట్విట్టర్ (Bhavish Aggarwal on Ola Electrice e-bikes) ద్వారా ధ్రువీకరించారు. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల గురించి వివరాలను తెలిపిన ఓ ట్వీట్‌ను జోడిస్తూ.. 'Yes next year' అంటూ స్పష్టతనిచ్చారు.
Yes next year👍🏼 https://t.co/dLT1n5qdRp
— Bhavish Aggarwal (@bhash) November 13, 2021
ఈ విషయంపై ఆయన తన బ్లాగ్‌లో కూడా రాసుకొచ్చారు. ఎలక్ట్రిక్ బైక్‌లతో పాటు.. కార్ల వ్యాపారంలోకి తమ సంస్థ విస్తరించొచ్చని సంకేతాలిచ్చారు.
Also read:Tips For reduce Expenses: ఈ టిప్స్‌తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!
ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారంలో రికార్డులు..
ఈ ఏడాది ఆగస్టులో ఓలా ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఎస్1, ఎస్1ప్రో వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే విక్రయాలు చెపట్టింది. డిసెంబర్ నుంచి రెండో విడత విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ సంస్థ వాహనాలను టెస్ట్డ్రైవ్ల కోసం వినియోగదారులకు అందుబాటులో ఉంచింది కూడా.
మొదటి విడతలో.. తొలి 24 గంటల్లో సెకనుకు 4 స్కూటర్ల చొప్పున రూ.600 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు నాటికి ఆ విక్రయాలు రూ.1,100 కోట్ల విలువకు చేరుకున్నాయి. వాహన రంగ చరిత్రలోనే ఇదో రికార్డని భవీష్ అప్పట్లో పేర్కొన్నారు.
Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం
Also read: SBI Card Alert: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు షాక్- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!
ఓలా ఫ్యాక్టరీ గురించి..
బెంగళూరుకు కొద్దిదూరంలో 'ఓలాఫ్యూచర్ ఫ్యాక్టరీ' పేరిట అతిపెద్ద తయారీ యూనిట్‌ను నిర్మిస్తోంది. 500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు దిచక్ర వాహన తయరీ కేంద్రంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఓలాఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నిర్వహిస్తుండటం విశేషం. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా సిద్ధమైతే 10 వేల మందికి పైగా మహిళలు ఇందులో పని చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పని చేస్తున్నారు.
Also read: Apple Store Workers: స్టోర్ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!
Also read: Rakesh Jhunjhunwala: ఆకాశ ఎయిర్ నుంచి బోయింగ్‌కు రూ.75 వేల కోట్ల ఆర్డర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook