NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఇందులో ప్రధానంగా ఈ పెన్షన్ స్కీములో యాజమాన్యం ఉద్యోగుల బేసిక్ శాలరీలో 10 శాతానికి బదులుగా 14 శాతం కోత విధిస్తుంది. అంటే ఇంతకుముందు ఎన్‌పిఎస్‌లో 10 శాతం మాత్రమే కాంట్రిబ్యూషన్ ఇచ్చే ఉద్యోగులు ఇప్పుడు 14 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 50,000 జీతం ఉంటేన ఎంత కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి :
మీ బేసిక్ జీతం రూ. 50 వేలు అయితే, మునుపటి రూల్ ప్రకారం, మీరు నెలవారీ రూ. 5000 కాంట్రిబ్యూషన్ గా ఇవ్వాలి, కానీ ఇప్పుడు రూల్ మారింది. ఇందులో ఎన్‌పిఎస్‌లో కాంట్రిబ్యూషన్ 14 శాతం ఉంటుంది, ఇప్పుడు రూ. 50 వేలు ప్రాథమిక మొత్తంలో మీరు ప్రతి నెలా రూ. 7,000 చెల్లించాలి, ఈ మొత్తం మీ రిటైర్‌మెంట్ ఫండ్‌లో జమ అవుతుంది. పదవీ విరమణ తర్వాత మునుపటి కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం కలుగుతుంది.
మార్పు వల్ల ఎంత ప్రయోజనం?
NPSలో చేసిన ఈ మార్పును వల్ల ఇప్పుడు మీ జీతంలో 14 శాతం వరకు ప్రతి నెలా NPS ఖాతాలో జమ చేస్తుంది, ఇది పదవీ విరమణ తర్వాత మీరు పొందే పెన్షన్ మొత్తాన్ని పెంచుతుంది. ప్రభుత్వం మీ NPS ఖాతాలో 14 శాతం విడిగా జమ చేస్తుంది. అంటే ఇప్పుడు NPS ఖాతాలో మునుపటి కంటే 4 శాతం ఎక్కువ జమ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత, ఉద్యోగులు మొత్తం డిపాజిట్ చేసిన ఫండ్‌లో 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు, అయితే 40 శాతం పెన్షన్ రూపంలో లభిస్తుంది.
NPS నెలవారీ కాంట్రిబ్యూషన్‌కు ప్రారంభ వయస్సు 25 సంవత్సరాలు కాగా, ఒక్కో ఉద్యోగి 60 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి నెలా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మీరు 35 సంవత్సరాల పాటు మీ NPS ఖాతాకు నెలవారీగా రూ. 5,000 జమ చేస్తే, మొత్తం కాంట్రిబ్యూషన్ రూ. 54,19,218 అవుతుంది. 10 శాతం వార్షిక వడ్డీతో, 60 ఏళ్ల వయస్సులో కార్పస్ రూ. 3,14,04,875 అవుతుంది. మీరు పదవీ విరమణ సమయంలో 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే, యాన్యుటీకి మిగిలిన 40 శాతం మొత్తం రూ. 1,25,61,950 అవుతుంది. మీరు దానిని పెట్టుబడి పెట్టి, 7 శాతం రాబడిని పొందినప్పుడు, మీకు వార్షిక మొత్తం రూ. 8,79,337 లేదా నెలవారీ పెన్షన్ రూ.73,278 లభిస్తుంది.
మీరు 60 ఏళ్ల వరకు మీ NPS ఖాతాకు నెలవారీ రూ. 7,000 జమ చేస్తే, మీ మొత్తం సహకారం రూ. 75,86,906 అవుతుంది. 10 శాతం వార్షిక వృద్ధితో, 35 సంవత్సరాల తర్వాత కార్పస్ రూ. 4,39,66,825 అవుతుంది. మీరు దాని నుండి 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే, యాన్యుటీగా మిగిలిన 40 శాతం మొత్తం రూ. 1,75,86,730 అవుతుంది. మీరు పెట్టుబడి పెట్టి 7 శాతం రాబడిని పొందినప్పుడు, దాని నుండి మీకు వచ్చే వార్షిక మొత్తం రూ. 12,31,071, నెలవారీ పెన్షన్ రూ. 1,02,589 వస్తుంది.
Also Read : Paris Olympics 2024: భారత్‌కు శుభవార్త..షూటింగ్లో ఫైనల్ చేరుకున్న మను భాకర్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter