Swiggy New Service Bolt: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ను అందించే ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గీ సరికొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ పేరు బోల్ట్ గా నామకరణం చేసింది. ఈ వేగవంతమైన డెలివరీ సేవలో, ఫుడ్, డ్రింక్స్ ను 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది. అంతేకాదు త్వరలోనే రూ. 10వేల కోట్లతో స్విగ్గీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ)ని కూడా ప్రారంభించబోతోంది. దీనికి సెబీ అనుమతి కూడా లభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫుడ్ డెలివరీ బోల్ట్ సర్వీస్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పూణే, చెన్నై, బెంగళూరు - 6 ప్రధాన నగరాల్లో ఈ సేవ ఇప్పటికే పనిచేస్తోంది. రానున్న కొద్ది వారాల్లో మరిన్ని జిల్లాలకు తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది.
బోల్ట్ వినియోగదారునికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుండి ఫాస్ట్ ఫుడ్ డెలివరీ సర్వీసులను అందిస్తుంది. రానున్న రోజుల్లో ఈ సర్వీసులను మరిన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నట్లు స్విగ్గీ తెలిపింది. BOLT బర్గర్‌లు, హాట్ సూప్స్, కూల్ డ్రింక్స్ , బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్, బిర్యానీ వంటి ఫేమస్ ఫుడ్స్ ను కేవలం పది నిమిషాల్లోనే కస్టమర్ కు చేరవేస్తుంది. ఎందుకటే వీటిని రెడీ చేసేందుకు సమయం కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఐస్ క్రీం, స్వీట్లు, స్నాక్స్ వంటి రెడీ టు ప్యాక్ వంటకాలపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు స్విగ్గీ తెలిపింది.
ముఖ్యంగా, బోల్ట్, సాధారణ ఆర్డర్‌ల మధ్య వ్యత్యాసం గురించి డెలివరీ భాగస్వాములకు (సప్లై పార్టనర్‌లకు) తెలియజేయలేదని కంపెనీ తెలిపింది. డెలివరీ సమయం ఆధారంగా వారికి ఎలాంటి ఫైన్ కానీ లేదా టిప్ ఉండదు. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రోహిత్ కపూర్ మాట్లాడుతూ, “బోల్ట్ మా మిషన్‌లో సాటిలేని సౌలభ్యాన్ని అందించే తదుపరి ఆఫర్. పది సంవత్సరాల క్రితం, Swiggy సగటు నిరీక్షణ సమయాన్ని 30 నిమిషాలకు తగ్గించడం ద్వారా ఆహార పంపిణీలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇప్పుడు దాన్ని మరింత తగ్గిస్తున్నాము అంటూ పేర్కొన్నారు.
కాగా జొమాటో కూడా పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ ప్రారంభించింది. అయితే అది వర్కవుట్ కాలేదు. దాంతో నిలిపివేసింది. ఆర్డర్ తీసుకున్న పది నిమిషాల్లోనే ఫుడ్ సప్లై చేస్తామంటూ జొమాటో ఇన్ స్టంట్ 2022 మార్చిలో ప్రకటించింది. అయితే ఇది తొమ్మిది నెలల్లోనే మూసివేసింది. ఇక దేశంలోని ప్రముఖ ప్రాంతాల నుంచి ఫుడ్ డెలివరీ చేసేందుకు గతంలో తీసుకువచ్చిన ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీసులను కూడా లాంచ్ చేసిన కొంత కాలానికే మూసేసింది జొమాటో. తర్వాత కార్పొరేట్ ఉద్యోగులు చేసే ఆర్డర్ల కోసం జొమాటో ఫర్ ఎంటర్ ప్రైజెస్ అనే కొత్త సర్వీసులను తీసుకువచ్చింది. మరి ఇప్పుడు స్విగ్గీ పది నిమిషాల డెలివరీ సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి