EPS New Scheme: "పెన్షన్ స్కీమ్-1995" కింద కనీస పింఛన్‌ను పెంచాలని ఎన్నో రోజులుగా కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. త్వరలో కార్మిక వర్గాలకు అనుకూలంగానే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈపీఎఫ్‌ఓ కొత్త పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పెన్షన్ ప్లాన్‌లో.. ఉద్యోగికి పింఛన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందే వారు కూడా.. వేతనం తీసుకునే ఉద్యోగుల మాదిరిగానే ఈ కొత్త పెన్షన్ ప్లాన్‌లో నమోదు చేసుకోవడానికి కూడా అనుమతి కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెన్షన్‌కు అందించాల్సినటువంటి మొత్తాన్ని.. మీ జీతం, మీకు ఉండేటటువంటి సర్వీస్ టైమ్ బట్టి నిర్ణయిస్తారు.
ఈపీఎఫ్ఓ కొత్త ఫిక్స్‌డ్ పింఛన్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫిక్స్‌డ్ పెన్షన్ అనేది మనీ కాంట్రిబ్యూషన్ బట్టీ నిర్ణయిస్తారు. మీరు కోరుకునే పెన్షన్ క్వాంటిటీకి తగ్గట్లుగా మనీ కాంట్రిబ్యూషన్స్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈపీఎఫ్ఓ..ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ 1995 ఆప్షన్ కోసం సిద్ధమవుతోంది. ఈపీఎస్‌లో ప్రస్తుతం ఉన్న మొత్తానికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే ఈపీఎస్ కింద లభించేటటువంటి కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.
ప్రస్తుతం కనీస పెన్షన్ మంత్లీ డొనేషన్ లిమిట్ 1250 రూపాయలుగా ఉంది. దీంతో ఉద్యోగులకు పెన్షన్ లిమిట్‌ను పెంచేందుకు ఈపీఎఫ్‌ఓ సన్నద్ధమవుతోంది.
ఈపీఎస్ ప్రస్తుత నియమం ప్రకారం.. ఈపీఎఫ్‌లో సభ్యులుగా ఉండే అందరూ ఈపీఎస్‌లో కూడా సభ్యులు అవుతారు. ఇక ఈపీఎస్ నియమం ప్రకారం ప్రస్తుతం.. ఎంప్లాయ్ బేసిక్ శాలరీలో 12శాతం కాంట్రిబ్యూషన్ పీఎఫ్‌లో జమ అవుతుంది. ఎంప్లాయ్‌తో పాటు ఎంప్లాయర్ నుంచి కూడా అంతే మొత్తంలో ఉద్యోగి పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మొత్తంలో 3.67% పీఎఫ్‌లో, అలాగే 8.33% ఈపీఎస్‌లో జమ అవుతుంది.
ఇక పెన్షన్‌ను ఇలా లెక్కించవచ్చు. నెలవారీ పెన్షన్ = (పెన్షన్ పొందదగిన జీతం x ఈపీఎస్ ఖాతాలో కంట్రిబ్యూషన్ అయిన సంవత్సరాల సంఖ్య) /70 ద్వారా పెన్షన్ పొందే మొత్తాన్ని తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి నెలవారీ వేతనం రూ. 15,000 అయి ఉండి ఆ వ్యక్తి 30 సంవత్సరాలు పనిచేసినట్లయితే, అతని నెలవారీ పెన్షన్ ఇలా లెక్కించవచ్చు... (15,000 X 30) / 70.. అతను నెలకు 6428 రూపాయలు పెన్షన్ అందుకుంటారు
Also Read: 'సూపర్ స్టార్' అభిమానులకు సర్‌ప్రైజ్.. ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా!!
Also Read: విండీస్ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
.
Monthly Pension Increase: గుడ్ న్యూస్ చెప్పనున్న ఈపీఎఫ్‌ఓ.. త్వరలో పెరగనున్న నెలవారీ పెన్షన్!
'పెన్షన్ స్కీమ్-1995' కింద కనీస పింఛన్‌ను పెంచాలని డిమాండ్
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు
త్వరలో కార్మిక వర్గాలకు అనుకూలంగానే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం
కొత్త పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశ పెట్టాలని భావిస్తోన్న ఈపీఎఫ్ఓ