Mg Comet: ఎంజీ నుంచి మార్కెట్‌లోకి నానో లాంటి కారు, రేట్లు ఎలా ఉన్నాయంటే?

Mg Comet Ev Price: ఎంజీ కామెట్(Mg Comet) నానో లాంటి కారును విడుదల చేయబోతునట్లు సమాచారం. అయితే ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలను కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 01:07 PM IST
Mg Comet: ఎంజీ నుంచి మార్కెట్‌లోకి నానో లాంటి కారు, రేట్లు ఎలా ఉన్నాయంటే?

Mg Comet Ev Price: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్‌ రోజురోజుకు పెరిగిపోతోంది. అంతేకాకుండా కంపెనీల మధ్య పోటీ కూడా మరింత పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో టాటా మోటార్స్‌ ముందడుగులో ఉంది. ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన టాటా టియాగో EVకి మంచి డిమాండ్‌ ఉంది. అయితే దీనికి పోటిగా ఎంజీ కంపెనీకి చెందిన వాహనం కూడా త్వరలో మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఇది చూడడానికి నానో కారుల ఉన్నప్పటికీ చాలా రకాల కొత్త ఫీచర్లతో కస్టమర్లకు పరిచయం చేయబోతున్నట్లు ఎంజీ పేర్కొంది. అయితే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 MG భారతదేశంలో విడుదల చేయబోయే నానో రకం కారును కామెట్(Mg Comet) అనే పేరుతో నామకరం చేసింది. ఈ పేరు 1934 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పోటీపడిన బ్రిటిష్ విమానం నుంచి తీసుకున్నారని కంపెనీ తెలిపింది. ఆ కాలంలో కామెట్ విమానానికి చాలా గుర్తింపు ఉండేదని, ఆ విమానంతో చాలా యుద్దాలు చేసేవారట. అందుకే ఈ కారుకు ఎంజీ కామెట్(Mg Comet) అని పేరు పెట్టారని తెలుస్తోంది. ఈ కారును భారత్‌లోనే విడుదల చేయడమేకాకుండా అంతర్జాతీయం స్థాయిలో లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కామెట్ ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అత్యాధునిక సాంకేతికతతో రాబోతోంది. అయితే ఇది చిన్న కారు కావడంతో కేవలం రెండు తలుపులతో మాత్రమే వస్తుందని సమాచారం. ఇది చూడడానికి చిన్న సైజ్‌లో ఉంటుంది. అంతేకాకుండా రూమి వీల్‌బేస్, లోపల ఓపెన్ ఇంటీరియర్‌ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు ధర విషయానికొస్తే 9 లక్షల కంటే తక్కువ ధరలో ఉండబోతోందని అంచనాలు.

MG కామెంట్‌ ఎలక్ట్రిక్ మోటార్ కారు వివరాలను ఇంకా వివరించలేదు.బ్యాటరీ ప్యాక్ 20 kWh కంటే కొంచెం ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250–300 కిలోమీటర్ల డ్రైవింగ్ మైలేజి ఇస్తుందని సమాచారం. అంతేకాకుండా 40 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది.అంతేకాకుండా పెద్ద టచ్‌స్క్రీన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ స్క్రీన్‌ ఉంటుంది. ఆటోమొబైల్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo

 

Trending News