Meta Layoffs: మరోసారి షాకిచ్చిన మెటా.. 10 వేల మంది ఉద్యోగులు తొలగింపు

Meta Job Cuts 2023 in India: మెటా కంపెనీ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీ నుంచి 10 వేల మంది తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజా లేఆఫ్‌లలో భారత్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు కోల్పోనున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని మెటా ఇంటికి పంపించింది.    

Written by - Ashok Krindinti | Last Updated : May 25, 2023, 10:33 PM IST
Meta Layoffs: మరోసారి షాకిచ్చిన మెటా.. 10 వేల మంది ఉద్యోగులు తొలగింపు

Meta Job Cuts 2023 in India: టేక్ రంగంలో తొలగింపులు ఆగడం లేదు. తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి లేఆఫ్‌లను ప్రకటించింది. మొత్తం 10 వేల మంది ఉద్యోగులను మూడో రౌండ్ రిట్రెంచ్‌మెంట్‌లో ఇంటికి సాగనంపనుంది. మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ తొలగింపుల్లో భాగంగా భారత్‌లోనూ కీలక పదవుల్లో ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇటీవలి రౌండ్‌లో మెటా రిట్రెంచ్‌మెంట్‌లో భారత్ నుంచి చాలా మంది పేర్లను జాబితాలో చేర్చింది.

ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, డైరెక్టర్, మీడియా పార్టనర్‌షిప్ హెడ్ సాకేత్ ఝా సౌరభ్‌లను మెటా తొలగించింది. ఈ రౌండ్ తొలగింపులలో మార్కెటింగ్, సైట్ భద్రత, ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్‌లో పనిచేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు కోల్పోయిన వారు లింక్‌డిన్‌లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 

మెటా లేఆఫ్‌లు ప్రకటించడం ఇది తొలిసారి కాదు. గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. తాజా తొలగింపులతో కలిపి మెటాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య జూలై 2021 సంవత్సరంలో ఉన్న సంఖ్యకు సమానం అయింది. 2020లో కరోనా మహమ్మారి సమయంలో మెటా పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టింది. దీంతో అప్పుడు కంపెనీ ఉద్యోగుల సంఖ్‌య డబుల్ అయింది. 

అయితే గత కొన్ని నెలలుగా మెటా ఆదాయంలో భారీగా తగ్గిపోయింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం, డిజిటల్ ప్రకటనల తగ్గింపు కారణంగా కంపెనీపై భారం పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల తొలగింపు తప్పడంలేదు. అదేవిధంగా తన ఖర్చులను తగ్గించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అనేక ఇతర కారణాలతో మెటానే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ మొదలైన అనేక పెద్ద కంపెనీలు గత కొన్ని నెలల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వరుస లేఆఫ్‌ల ప్రకటనతో ప్రైవేట్ రంగంలో ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి ఉంది.

Also Read: Group-1 and Group-2 Notification: గ్రూప్‌-1, 2 ఉద్యోగార్ధులకు శుభవార్త.. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల  

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News