Maruti Suzuki EV: త్వరలో మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే

Maruti Suzuki EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే టాటా, మహీంద్రా కంపెనీలు ఈవీ కార్లు ప్రవేశపెట్టాయి. అయితే కార్ల మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈ రంగంలో ప్రవేశించలేదు. ఇప్పుుడు మారుతి సుజుకి సైతం ఈవీ కారు లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2023, 06:53 PM IST
Maruti Suzuki EV: త్వరలో మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే

Maruti Suzuki EV: ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఈవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ప్రముఖ కంపెనీలన్నీ ఈవీ కార్లపై దృష్టి పెట్టాయి. దేశంలో ఈవీ కారు మార్కెట్‌లో అత్యధిక వాటాను టాటా ఇప్పటికే చేజిక్కించుకోగా మహీంద్రా పోటీ ఇస్తోంది. దేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన బ్రాండ్ మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈ రంగంలో ఎంట్రీ ఇవ్వలేదు. త్వరలో ఈవీ కారు లాంచ్ చేసేందుకు మారుతి సుజుకి సిద్ధమౌతోంది.

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల గురించి చెప్పగానే టాటా మోటార్స్ పేరు ముందుగా విన్పిస్తుంది. దేశంలో ఈవీ కారును ముందుగా లాంచ్ చేసింది ఈ కంపెనీనే. టాటా తరువాత ఆ స్థానం మహీంద్రా కంపెనీది. దేశ ఆటోమొబైల్ కార్ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈవీ విభాగంలో ఎంట్రీ ఇవ్వలేదు. టాటా, మహీంద్రాలు ఈవీ విభాగంలో ఒకదాని తరువాత మరొక మోడల్ కార్లను ప్రవేశపెడుతోంది. మారుతి సుజుకి ఈ విభాగంలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడనుంది.

మారుతి సుజుకి ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో తన ఎలక్ట్రిక్ కారు eVX గురించి వివరించింది. 2024లో మారుతి సుజుకి నుంచి ఈవీ కారు లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ ప్రక్రియ దక్షిణ యూరప్‌లో పూర్తయింది. ఈ కారు మారుతి సుజుకి కంపెనీకు చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో ఇండియాలో మారుతి సుజుకి ఈవీ విభాగంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీవో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. మారుతి ప్రవేశపెట్టనున్న ఈవీ వెర్షన్ దాదాపు 4300 మిల్లీమీటర్ల పొడవు, 1800 మిల్లీమీటర్ల వెడల్పు, 1600 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది.

మారుతి సుజుకి eVX ఎస్‌యూవీలో 60 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 550 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రొడక్షన్ వెర్షన్ కూడా 500 కిలోమీటర్లు అందించవచ్చు.

Also read: Tips For Car Loans: కొత్త కారు కొంటున్నారా ? కారు లోన్ తీసుకుంటున్నారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News