Maruti Suzuki Jimny Price: మహీంద్రా థార్ ను మించిన మరో ఆఫ్ రోడ్ కార్.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Maruti Suzuki Jimny Price: మార్కెట్లోకి మరో ఆఫ్ రోడ్ కార్ విడుదల కానుంది. ఈ కారును మారుతి సుజుకి జిమ్మీ పేరుతో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కారుకు సంబంధించిన ఫీచర్లేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 13, 2023, 10:56 AM IST
Maruti Suzuki Jimny Price: మహీంద్రా థార్ ను మించిన మరో ఆఫ్ రోడ్ కార్.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Maruti Suzuki Jimny Price: మహీంద్రా థార్ తర్వాత మార్కెట్లోకి మరో ఆఫ్ రోడ్ SUV కార్ విడుదల కానుంది. ఈ కారును ప్రముఖ మారుతి సుజుకి కంపెనీ విడుదల చేయబోతోంది. మారుతి సుజికి జిమ్మీ పేరుతో ఈ ఆఫ్ రోడ్ కారును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ కార్ల తయారీ కేంద్రాలను భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రారంభించింది. కంపెనీ తన మొదటి యూనిట్ ఫోటోను విడుదల చేసింది. మారుతి ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో జిమ్నీని పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆఫ్ రోడ్ కారుకు సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం..

మారుతి సుజుకి జిమ్మీ కి సంబంధించిన ఫ్రీ బుకింగ్ కూడా ప్రారంభమైంది. ఈ ఫ్రీ బుకింగ్ చేసుకున్న వారికి జూన్ లో ఈ కారును డెలివరీ చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ కారుకు సంబంధించిన ధరను ఇప్పటికీ కంపెనీ తెలుపకపోవడం విశేషం.. మహేంద్ర విడుదల చేసిన ఆఫ్ రోడ్ కారు కంటే దీని ధర తక్కువగానే ఉండబోతున్నట్లు సమాచారం.

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

జిమ్మీ ఫీచర్లు స్పెసిఫికేషన్స్:
జిమ్మీ లో చాలా రకాల వేరియంట్లు ఉన్నాయి ఇప్పుడు మనం కే సిరీస్ వేరియంట్ గురించి తెలుసుకుందాం.. ఈ వేరియంట్ విషయానికొస్తే.. వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ తో మార్కెట్లోకి రానుంది. ఇది పై సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో లభించబోతోంది. అంతేకాకుండా ఈ ఇంజన్ 101 BHP శక్తితో పాటు130 NM టార్క్‌ ఉత్పత్తిని చేస్తుంది. ఈ ఆఫ్ రోడ్ కార్ కు 5-స్పీడ్ మాన్యువల్ తో పాటు  4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులో ఉందనుంది. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.

జిమ్నీ జెట్టా వేరియంట్ ఫీచర్లు:

  1. 15-అంగుళాల స్టీల్ వీల్స్
  2. గన్‌మెటల్ గ్రే గ్రిల్ విత్ క్రోమ్ ప్లేటింగ్
  3. హాలోజన్ హెడ్‌ల్యాంప్స్
  4. 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  5. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే
  6. 4 స్పీకర్స్మల్టీ
  7. ఇన్ఫో
  8. డిస్‌ప్లే టిల్ట్

జిమ్నీ ఆల్ఫా వేరియంట్ ఫీచర్లు:

  1. లెదర్ వార్ప్డ్ స్టీరింగ్ వీల్
  2. బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్
  3. హెడ్‌ల్యాంప్ వాషర్స్
  4. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  5. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే
  6. 4 ఆటోమేటిక్ సిస్టమ్ కంట్రోల్డ్
  7. ఆటోమేటిక్ సిస్టం
  8. క్రూయిస్ కంట్రోల్
  9. 15-అంగుళాల అల్లాయ్ వీల్స్
  10. ఆటో LED హెడ్‌ల్యాంప్స్
  11. ఫాగ్ ల్యాంప్స్
  12. పవర్ విండోస్
  13. 6 ఎయిర్‌బ్యాగ్స్
  14. రియర్ పార్కింగ్ కెమెరా

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News