Maruti to Mahindra: ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే..

Maruti, Hyundai vs Tata, Mahindra: హ్యూందాయ్ మోటార్స్ ఇండియా మార్కెట్ షేర్ గతేడాది ఫిబ్రవరిలో 14.95 శాతంగా ఉండగా.. ఈ ఏడాది మార్కెట్ షేర్ 13.62 శాతానికి చేరుకుంది. గతేడాది ఫిబ్రవరి నెలలో 38,688 కార్లు విక్రయించిన హ్యూందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది 39,106 కార్లు విక్రయంచింది.

Written by - Pavan | Last Updated : Mar 7, 2023, 10:04 PM IST
Maruti to Mahindra: ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే..

Maruti, Hyundai vs Tata, Mahindra: ఫిబ్రవరి నెలకు సంబంధించి మారుతి సుజుకి, హ్యూందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా, కియా మోటార్స్ ఇండియా కంపెనీలకు చెందిన కార్ల అమ్మకాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) వెల్లడించిన ఈ గణంకాలను వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే.. ఈ ఏడాది ఫ్రిబవరి నెలలో 1,18,892 మారుతి సుజుకి కార్లు అమ్ముడయ్యాయి. 2022 ఫిబ్రవరి నెలలో 1,09,611 కార్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 1,18,892 కి పెరిగింది. అయితే, మొత్తంగా మార్కెట్ షేర్ పరంగా చూస్తే.. గతేడాది 42.36 శాతంగా ఉన్న మార్కెట్ షేర్.. 41.40 శాతానికి చేరుకుంది.

అలాగే హ్యూందాయ్ మోటార్స్ ఇండియా మార్కెట్ షేర్ గతేడాది ఫిబ్రవరిలో 14.95 శాతంగా ఉండగా.. ఈ ఏడాది మార్కెట్ షేర్ 13.62 శాతానికి చేరుకుంది. గతేడాది ఫిబ్రవరి నెలలో 38,688 కార్లు విక్రయించిన హ్యూందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది 39,106 కార్లు విక్రయంచింది. యాన్వల్ సేల్స్ పరంగా హ్యూందాయ్ మోటార్స్ ఇండియా కార్ల విక్రయాల్లో పెరుగుదల కనిపించింది. 

ఇక టాటా మోటార్స్ విషయానికొస్తే.. గతేడాది ఇదే ఫిబ్రవరి నెలలో 34,055 కార్లు అమ్ముడు పోగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 38,965 కార్లు అమ్ముడుపోయాయి. మార్కెట్ షేర్ పరంగా చూస్తే.. గతేడాది 13.16 గా ఉన్న మార్కెట్ షేర్ ఈ ఏడాది 13.57 కి పెరిగింది. అంటే యాన్వల్ సేల్స్ పరంగా చూసినా.. లేక మార్కెట్ షేర్ పరంగా చూసినా.. టాటా మోటార్స్ సత్తా చాటుకుందనే చెప్పొచ్చు. 

ఇక మహింద్రా అండ్ మహింద్రా విషయంలో కూడా అదే జరిగింది. గతేడాది ఫిబ్రవరిలో 18,264 కార్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 29,356 కార్లు అమ్ముడుపోయాయి. మార్కెట్ షేర్ సైతం 7.06 శాతం నుంచి 10.22 శాతానికి పెరిగింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కియా మోటార్స్ ఇండియా కార్ల విషయానికొస్తే.. 2022 ఫిబ్రవరి నెలలో 13,623 కియా కార్లు విక్రయించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 19,554 కియా కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే ఫిబ్రవరి నెలలో 5.27 శాతంగా ఉన్న మార్కెట్ షేర్.. ఈ ఫిబ్రవరి నెలలో 6.81 శాతానికి పెరిగింది.

ఇది కూడా చదవండి : Old Vehicles Seizing: ఆ నెంబర్ సిరీస్ వాహనం కనిపిస్తే చాలు సీజ్.. ఇప్పటికే 800 వాహనాలు సీజ్

ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?

ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News