Maruti Dzire Car: ఏడు లక్షల కారు మూడున్నర లక్షలకే.. ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసా?

 Maruti Suzuki Dzire Used Car Price: మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచు, ఇప్పుడు అలాంటి కారు తక్కువ ధరలో కావాలంటే మీరూ చూసేయండి.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 25, 2023, 05:22 PM IST
Maruti Dzire Car: ఏడు లక్షల కారు మూడున్నర లక్షలకే.. ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసా?

Maruti Suzuki Dzire Used Car in Low Price: మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెడాన్ కార్లకు ఇప్పుడు దేశంలో పెద్దగా డిమాండ్ లేకపోయినా, మారుతి డిజైర్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతోంది. ఈ ఇప్పుడు కూడా మారుతి సుజుకి డిజైర్ కారును ప్రతి నెలా 10 వేల మందికి పైగా కొనుగోలు చేస్తున్నారు. మారుతి డిజైర్ ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్ లోకి వస్తోంది.

కానీ ఉపయోగించిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌కు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఇప్పటికీ చాలా బలమైన డిమాండ్ ఉంది. తక్కువ ధరలో మంచి కంఫర్ట్, సహా మంచి బూట్ స్పేస్ కోసం ఈ కార్ ఒక మంచి ఆప్షన్. మీరు కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మేము మీ కోసం కొన్ని అషన్స్ తీసుకొచ్చాము, అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కారు ధరలు కొంచెం ఎక్కువే కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ కార్లు మీ ముందుకు తీసుకొచ్చాం.  ఈ కార్ల ధర సుమారు రూ. 3.5 లక్షలు నుంచి మొదలవుతున్నాయి, వాటిని ఫిబ్రవరి 25న ఢిల్లీ ప్రాంతంలో Cars24 వెబ్‌సైట్‌లో వచ్చిన మూడు ఆఫర్లు మీ కోసం. 

1. 2013 మారుతి స్విఫ్ట్ డిజైర్ 
LXI 2013 మోడల్ ఒక తెలుపు రంగు మారుతి స్విఫ్ట్ డిజైర్. ఈ కారు ఇప్పటివరకు 53,808 కి.మీ తిరిగింది. ఇక ఈ కారు అమ్మకం కోసం ఓనర్ రూ. 3.53 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కారు సీఎన్జీతో నడుస్తుంది, ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ DL-8Cతో వస్తుంది. 

2. 2014 మారుతి స్విఫ్ట్ డిజైర్ 
VXI 2014 రిజిస్ట్రేషన్‌తో వస్తున్న ఈ స్విఫ్ట్ డిజైర్ ఇప్పటి వరకు 38,606 కి.మీ ప్రయాణించింది, ఇక ఈ కారు అమ్మకం కోసం ఇందుకోసం ఓనర్ రూ.3.80 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వైట్ కలర్ డిజైర్ కారు పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ DL-7Cగా ఉంటుంది. 

3. 2012 మారుతి స్విఫ్ట్ డిజైర్:
 VXI 2012 రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ స్విఫ్ట్ డిజైర్ ఇప్పటివరకు 91,360 కి.మీ. తిరిగింది, ఇక ఈ కారు అమ్మకం కోసం ఓనర్ రూ.3.21 లక్షలు డిమాండ్ చేస్తున్నారు, ఇక ఈ వైట్ కలర్ డిజైర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR-26తో వస్తుంది. 

Also Read: Hollywood Critics Award: హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్స్‌లో క్లీన్ స్వీప్.. ఆర్ఆర్ఆర్ హవా.. రామ్ చరణ్ క్రేజ్‌కు నిదర్శనమిదే!

Also Read: Honda City: పిచ్చెకించే లుక్‌తో హోండా సిటీ  న్యూ వేరియంట్‌, ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.70,000 డిస్కౌంట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News