LIC's Mega IPO gets Sebi nod: ఎల్‌ఐసీ ఐపీఓకి (LIC IPO) సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న 22 రోజుల్లోనే అనుమతి లభించింది. సాధారణంగా ఏదైనా కంపెనీ ఐపీఓకి దరఖాస్తున్న చేసుకున్న తర్వాత కనీసం 30 నుంచి 40 రోజుల తర్వాతే సెబీ (Sebi) ఆమోదిస్తుంది. ఐతే ఎల్‌ఐసీ (LIC) విషయంలో సెబీ త్వరగా నిర్ణయం తీసుకుంది.
సెబీ అనుమతి లభించిన తర్వాత ఐపీఓకి వెళ్లడమే ఇక మిగిలింది. అది ఎప్పడన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికే పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం భావించింది. కానీ అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదని ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine Crisis) నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే అందుకు కారణం. ఈ టైంలో ఐపీఓకి రావడం వల్ల మదుపర్లు పెట్టుబడికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం అమ్మనుంది.
Also Read: Cruid Oil Price: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, మరింతగా పెరగనున్న పెట్రోల్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook