LIC Saral Pension Scheme: ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే.. జీవితాంతం పెన్షన్ ఇచ్చే స్కీమ్

LIC’s Saral Pension Scheme: ఎల్ఐసి సరళ్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారు కనీసం 40 ఏళ్ల నుండి గరిష్టంగా 80 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టే వారు ఇతర ఇన్సూరెన్స్ పాలసీల తరహాలో హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... 

Written by - Pavan | Last Updated : Nov 21, 2023, 12:25 PM IST
LIC Saral Pension Scheme: ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే.. జీవితాంతం పెన్షన్ ఇచ్చే స్కీమ్

LIC’s Saral Pension Scheme: ఎల్ఐసి అనగానే చాలా కాలం పాటు సంవత్సరానికి కనీసం ఒకసారి లేదా రెండు, మూడు సార్లు ప్రీమియం చెల్లిస్తూ వెళ్తే కానీ ఆ ఎల్ఐసి పాలసీ వల్ల వచ్చే బెనిఫిట్స్ అందుకోలేం అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఎల్ఐసిలో ఒక స్కీమ్ ఉంది.. అది ఎలా డిజైన్ చేశారంటే.. జీవితంలో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు.. ఇక జీవితాంతం నెలకు కనిష్టంగా రూ. 1000 రూపాయల పెన్షన్ చొప్పున సంవత్సరానికి మొత్తం రూ. 12,000 పెన్షన్ వచ్చేలా ఆ ఎల్ఐసి పాలసీని రూపకల్పన చేశారు. ఆ ఎల్ఐసి పాలసీ స్కీమ్ పేరే ఎల్‌ఐసి సరళ్ పెన్షన్ యోజన స్కీమ్. 

ఎల్ఐసి సరళ్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్స్ రూ. 2.15 లక్షల మేర ఒకే ఒక్క ప్రీమియం చెల్లించడం ద్వారా సంవత్సరానికి మొత్తం రూ. 12,000 పెన్షన్ పొందవచ్చు. ఎల్ఐసి పాలసీదారు తమ పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్లు పైబడిన తర్వాత వారికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించేలా ఎల్ఐసి జీవన్ సరల్ ప్లాన్ డిజైన్ చేశారు. ఎల్ఐసి సరళ్ పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన వారు అర్హత సాధించిన తరువాత నెలకు వెయ్యి రూపాయలు చొప్పున లేదా మూడు నెలలకు ఒకసారి రూ. 3 వేలు చొప్పున, లేదా ప్రతీ ఆరు నెలలకు ఒకసారి రూ. 6,000 చొప్పున పెన్షన్ పొందవచ్చు. లేదంటే పాలసీదారుల నిర్ణయం మేరకు ఏడాదికి ఒకేసారి 12 వేల రూపాయల చొప్పున పెన్షన్ పొందే వెసులుబాటు కూడా ఉంది. 

వయస్సు అర్హతలు : 
ఎల్ఐసి సరళ్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారు కనీసం 40 ఏళ్ల నుండి గరిష్టంగా 80 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టే వారు ఇతర ఇన్సూరెన్స్ పాలసీల తరహాలో హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది రిటైర్మెంట్ తరువాత పెన్షన్ పొందేలా డిజైన్ చేసిన పాలసీ కానీ సాధారణ ఇన్సూరెన్స్ ప్లాన్ కాదు. ఒకవేళ రూ. 5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగితే.. పెన్షన్ కింద లభించే ఆర్థిక ప్రయోజనాలు కూడా అంతే అధిక మొత్తంలో ఉంటాయి. 

ఇది కూడా చదవండి : Highest Mileage CNG Cars: అత్యధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లు ఇవే

బతికి ఉన్నంత కాలం పెన్షన్.. మరి ఆ తరువాత ఏంటి ?
ఎవరిపేరు మీదైతే ఈ ఎల్ఐసి సరళ్ పెన్షన్ యోజన స్కీమ్ పాలసీ ఉంటుందో.. వారు బతికి ఉన్నంత కాలం వారికి ముందు చెప్పుకున్న విధంగా పెన్షన్ లభిస్తుంది. వారి మరణానంతరం వారు పేర్కొన్న నామినిలకు లేదా వారసులకు మొత్తం 100 శాతం ప్రీమియం వెనక్కి లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ కొనేవారికి బంపర్ గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News