LIC Saral Pension Yojana: 40 ఏళ్లకే పెన్షన్.. ఒక్కసారి పెట్టుపెడితే జీవితాంతం లాభం

Lic Saral Pension Plan Benefits: ఎల్ఎఐసీ తీసుకువచ్చిన ఓ పథకంలో ఒకేసారి ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే చాలు.. మీకు జీవితాంతం లాభం ఉంటుంది. 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఆ పథకం గురించి పూర్తి వివరాలు ఇవిగో..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 04:22 PM IST
LIC Saral Pension Yojana: 40 ఏళ్లకే పెన్షన్.. ఒక్కసారి పెట్టుపెడితే జీవితాంతం లాభం

Lic Saral Pension Plan Benefits: మీరు సురక్షితంగా.. లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఎల్ఎఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) తీసుకువచ్చిన ఈ పథకం గురించి తెలుసుకోండి. ఇప్పటివరకు మీరు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో పింఛను పొందడం గురించి విని ఉంటారు. కానీ 40 ఏళ్ల వయస్సులోనే పెన్షన్ పొందవచ్చు. మీరు పెన్షన్ కోసం చాలా కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎల్ఎఐసీ తీసుకువచ్చిన కొత్త పథకంలో ఒకేసారి ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే.. చిన్న వయస్సులోనే పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

ఈ పథకం పేరు సరళ్ పెన్షన్ యోజన. ఇది ఒకే ప్రీమియం పెన్షన్ ప్లాన్. ఇందులో పాలసీ తీసుకునే సమయంలో ఒకసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఆ తరువాత మీరు జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే.. ఒకేసారి ప్రీమియం మొత్తం అతని నామినీకి చెల్లిస్తారు. సరళ్ పెన్షన్ యోజన అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్. అంటే మీరు పాలసీ తీసుకున్న వెంటనే మీకు పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రారంభమయ్యే పెన్షన్ మొత్తం జీవితాంతం అందుతుంది.

మీరు రెండు మార్గాల్లో పాలసీని ఎంచుకోవచ్చు.

సింగిల్ లైఫ్: ఇందులో  పాలసీ ఎవరి పేరు మీదనైనా తీసుకోవచ్చు. పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం అతను పెన్షన్ పొందుతూనే ఉంటాడు. అతని మరణం తర్వాత బేస్ ప్రీమియం మొత్తం అతని నామినీకి తిరిగి చెల్లిస్తారు.

ఉమ్మడి జీవితం: ఇందులో  భార్యాభర్తలిద్దరికీ కవరేజ్ ఉంటుంది. ప్రాథమిక పింఛనుదారులు జీవించి ఉన్నంత కాలం వారికి పింఛను అందుతూనే ఉంటుంది. అతని మరణానంతరం అతని జీవిత భాగస్వామి జీవితాంతం పెన్షన్ అందజేస్తారు. భాగస్వామి మరణం తర్వాత బేస్ ప్రీమియం మొత్తం నామినీకి అందజేస్తారు.

ఎవరు అర్హులు..?

ఈ పథకం ప్రయోజనం కోసం కనీస వయోపరిమితి 40 సంవత్సరాలు. గరిష్టంగా 80 సంవత్సరాలు. పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం పెన్షన్ జీవితాంతం అందుబాటులో ఉంటుంది. సరళ్ పెన్షన్ పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు.

పింఛను ఎంత అందుతుంది..?

ప్రతి నెలా లేదా మూడు నెలలు, ఆరు నెలలు, 12 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. మీరు ఏ ఎంపికను ఎంచుకున్నా.. ఆ సమయంలో మీ పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత మొత్తంలో పింఛను ఎంచుకున్నా.. దాని ప్రకారం ప్రీమియం చెల్లించాలి. మీ వయస్సు 40 సంవత్సరాలు అనుకుంటే.. మీరు రూ.10 లక్షల ఒక్క ప్రీమియం డిపాజిట్ చేసినట్లయితే.. మీకు సంవత్సరానికి రూ.50,250 పెన్షన్ అందుతుంది. ఇది జీవితాంతం అందుబాటులో ఉంటుంది. ఒక వేళ మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని మధ్యలో తిరిగి తీసుకోవాలని అనుంకుటే.. 5 శాతం తగ్గించి మీరు చెల్లించిన డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు.

Also Read: Pawan Kalyan: కోడి కత్తులతో గీయించుకుని డ్రామాలు.. నా అభిమానులు జగన్‌కే ఓటు వేశారు: పవన్ కళ్యాణ్‌  

Also Read: Hyderabad Metro: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రెండో దశ మెట్రోకు ముహుర్తం ఫిక్స్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News