Lava Blaze : బడ్జెట్ ధరలో లావా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ ఆఫర్ కింద రూ.1 వెయ్యి తగ్గింపు.. ఫీచర్స్ ఇవే...

Lava Blaze Smartphone: బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే లావా నుంచి ఇండియన్ మార్కెట్లోకి కొత్త మోడల్ లాంచ్ అయింది. ధర, ఫీచర్స్ ఇతరత్రా వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 7, 2022, 04:57 PM IST
  • లావా నుంచి కొత్త మోడల్
  • ఇండియన్ మార్కెట్లోకి లావా బ్లేజ్ లాంచ్
  • లాంచింగ్ ఆఫర్ కింద రూ.1 వెయ్యి తగ్గింపు
Lava Blaze : బడ్జెట్ ధరలో లావా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ ఆఫర్ కింద రూ.1 వెయ్యి తగ్గింపు.. ఫీచర్స్ ఇవే...

Lava Blaze Smartphone: దేశీ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం లావా ఇండియన్ మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్‌ 'లావా బ్లేజ్'ను లాంచ్ చేసింది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.9699. లాంచింగ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అంటే డిస్కౌంట్ పోను రూ.8699కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.. 

లావా బ్లేజ్ ఫీచర్స్ :

ఇది 4జీ స్మార్ట్ ఫోన్. 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీతో సింగిల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. మిడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, మైక్రో ఎస్డీ కార్డ్, 256 జీబీ ఎక్స్‌పాండ్ స్టోరేజీ, 13 మెగా పిక్సెల్ బ్యాక్ ట్రిపుల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ఇయర్ బడ్స్ ఉచితం :

లావా బ్లేజ్ నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ రెడ్, గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ ఇందులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, లావా ఇండియా వెబ్‌సైట్,రిటైల్ స్టోర్స్ ద్వారా ప్రస్తుతం ప్రీబుకింగ్ అందుబాటులో ఉంది. ప్రీబుకింగ్ చేసుకునే మొదటి 500 మంది లావా ఇయర్ బడ్స్ ఉచితంగా పొందవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు కోసం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. 100 రోజుల వరకు ఈ స్మార్ట్ ఫోన్‌కి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, ఫ్రీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. 

Also Read: Marriages of Politicians: రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాజకీయ నాయకులు వీరే..!

Also Read: Boris Johnosn Resign: సంచలనం... యూకె ప్రధాని బోరీస్ జాన్సన్ రాజీనామా...!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News