Kokapeta Land Costs Rs 100 Cr Per Acre: హైదరాబాద్‌లో భూమికి ఎంత విలువ ఉందో మరోసారి చాటి చెప్పిన ఘటన ఇది. దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబై లాంటి మహా నగరాలే కాదు.. మన రాజధాని మహా నగరం భాగ్యనగరి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో '' ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ " అనిపించుకుంది. హైదరాబాద్‌లో సౌకర్యాలు గ్లోబల్ సిటీని తలపిస్తున్నాయో లేదో తెలీదు కానీ భూముల ధరలు మాత్రం గ్లోబల్ సిటీలను మైమరిపిస్తున్నాయి. తాజాగా కోకాపేట సమీపంలో ఎకరం భూమి అక్షరాల 100 కోట్ల రూపాయలు పలికిన ఘటన దేశంలోనే పేరుమోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేసింది.
అవును, మీరు చదివింది నిజమే. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట వద్ద హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలోని 10వ నెంబర్ ప్లాట్‌లో ఎకరం భూమి రూ. 100 కోట్లు పలికింది. ఈ - వేలం పద్ధతిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహించిన ఆక్షన్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజాలుగా పేరున్న సంస్థలు పాల్గొనగా అంతిమంగా ఏపీఆర్ గ్రూప్ - రాజ్ పుష్ప ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా రేటు పెంచుతూ రూ. 100 కోట్ల మార్క్ తాకేలా చేశాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో పేరున్న సంస్థలైన ఏపీఆర్ గ్రూప్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ సంస్థల మధ్య పోటీ అంతటితో అయిపోలేదు. రూ. 100 కోట్లు మార్క్ తాకిన తరువాత సైతం ఈ రెండు సంస్థల మధ్య ఈ-వేలం పోటీ ఇంకా కొనసాగడం గమనార్హం. అంతిమంగా రూ. 100.75 కోట్ల ఏపీఆర్ గ్రూప్ ఈ బిడ్డింగ్ లో పై చేయి సాధించి ఆ స్థలాన్ని దక్కించుకుంది. హైదరాబాద్‌లో ఒక భాగం అనుకునేలా నగరాన్ని ఆనుకునే ఉండటంతో పాటు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు వంటివాటికి సమీపంలో ఉండటంతో కోకాపేట భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగానే ఇక్కడ భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయా అన్నట్టుగా ఇంత భారీ ధర పలుకుతోంది.
ఈ వేలంలో పాల్గొని కోకాపేటలో భూమిని దక్కించుకోవాలి అనుకునే వారికి ఎకరం భూమి కనిష్ట విలువ రూ. 35 కోట్లుగా హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఆ తరువాత వేలంలో పాల్గొని రేటు పెంచాలి అనుకునే వారు కనిష్టంగా ఒక గజానికి రూ. 25 లక్షలు రేటు పెంచేలా షరతులు విధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా పోటీపడుతూ ఎకరం భూమిని రూ. 100 కోట్ల మార్క్ వరకు తీసుకెళ్లాయి.
ఇది కూడా చదవండి : Most Highest Selling Car: ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడైన కారు ఇదే..
గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ HMDA ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించిన ఈ-వేలంలోనూ రికార్డ్ స్థాయిలో ఒక చదరపు గజం స్థలం అక్షరాల లక్ష రూపాయలకుపైనే అమ్ముడుపోయి అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులు బద్ధలుకొట్టగా.. తాజాగా కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్ల మార్క్ తాకి మరో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ధరలపరంగా భూమి - ఆకాశం కలిసిపోతాయా అనేలా ఉంది పరిస్థితి అంటున్నారు ఈ మొత్తం సీన్‌ని నిశితంగా పరిశీలిస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్‌పర్ట్స్.
ఇది కూడా చదవండి : Business Ideas Without Investment: ఇంట్లో ఉండే చేసుకునే లాభదాయకమైన వ్యాపారాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి