Business Ideas For Women: మహిళలు అంటే ఏం చేస్తారులే అనే చిన్నచూపు చూసే రోజులు ఎప్పుడో పోయాయి .. ఇప్పుడు మహిళలు అన్నింటా రాణించడమే కాదు.. మకుటం లేని మహారాణుల్లా వెలుగొందుతున్న రోజులు ఇవి. ఒక వయసొచ్చాకా మహిళలు ఏమీ చేయలేరు.. ఇక ఇంటికో లేక వంటింటికో పరిమితం అవడం తప్ప అనే ధోరణిని పారదోలుతూ 50 ఏళ్ల వయస్సులో ఒక మహిళ మొదలుపెట్టిన వ్యాపారం ఇంతింతై.. వటుడింతై అన్నచందంగా ఎదిగి.. ఇప్పుడు అదొక మహా సామ్రాజ్యమైపోయింది..
ఆమె పేరు కమల్జీత్ కౌర్.. అచ్చమైన పంజాబీ మహిళ.. కమల్జీత్ కౌర్ తన 50 ఏళ్ల వయస్సులో కిమ్మూస్ కిచెన్ పేరిట వ్యాపారం ప్రారంభించింది. ఈ బిజినెస్ ఐడియా ఏంటంటే.. చిక్కటి పెరుగు నుంచి తాజా నెయ్యిని తయారు చేయడమే కమల్జీత్ కౌర్ బిజినెస్ ఐడియా. పెరుగు నుంచి తప్పించి వెన్న నుంచి కానీ లేదా క్రీమ్ నుంచి కానీ నెయ్యి తీసి విక్రయించకూడదు అనేది కమల్జీత్ కౌర్ పెట్టుకున్న నియమం.
సంక్షోభాన్ని సదవకాశంగా మల్చుకున్న మహిళ..
కొవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రపంచం అంతా అవకాశాలు కోల్పోయి అవస్తలు పడుతున్న సమయంలోనే సంక్షోభాన్నే ఒక సదవకాశంగా మల్చుకున్న ధీశాలి కమల్జీత్ కౌర్. ఈ బిజినెస్ కోసం ఆమె వెంటనే ఫ్యాక్టరీలు స్థాపించలేదు.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టలేదు. 2020లో ముంబైలోని తన వంట గది నుంచే కమల్జీత్ కౌర్ గీ బిజినెస్ పురుడుపోసుకుంది... అక్కడే పెరిగి పెద్దదై రెండు, మూడేళ్ల వ్యవధిలోనే నెలకు రూ. 20 లక్షల ఆదాయం సంపాదించే పెట్టే స్థాయికి ఎదిగింది అంటే అతిశయోక్తి లేదు.
కమల్జీత్ కౌర్ గీ బిజినెస్ ఎలా పుట్టిందంటే..
కమల్జీత్ కౌర్ పుట్టి పెరిగింది పంజాబ్‌లోని లుధియానా. పెళ్లి అయ్యేంత వరకు ఏనాడు అనారోగ్యం బారిన పడని తాను.. పెళ్లి చేసుకుని ముంబై వచ్చేశాకా స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి లాంటి డైరీ ఉత్పత్తులు లేక అనారోగ్యం బారినపడ్డారట. అందుకే తానే డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్ లోకి దిగి.. తాను ఏదైతో కోల్పోయానో.. అదే ఇతరులకు అందిస్తూ అందులోనే తన వ్యాపారాన్ని వెతుక్కోవాలి అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ కమల్జీత్ కౌర్ ప్యూర్ గీ బిజినెస్.
లుధియానా నుంచి పాలు తెప్పించి మరీ..
తాను పుట్టి పెరిగిన లుధియానాలోనే స్వచ్ఛమైన పాలు లభిస్తాయనేది కమల్జీత్ కౌర్ బలమైన విశ్వాసం. అందుకే అక్కడి నుంచే పాలు తెప్పించి మరీ నెయ్యి తయారు చేయించేది. అది కూడా బటర్ నుంచో లేక క్రీమ్ నుంచో నెయ్యిని తయారు చేయకుండా.. ముందుగా ఆవు పాలను కాచి అందులో చెంచాడు పెరుగుతో తోడు పెట్టి... ఆ తరువాత ఒక రాత్రంతా అలాగే వదిలేసి.. ఆ మరునాడు పెరుగును చిలికి నెయ్యిని తయారుచేసేది. కమల్జీత్ కౌర్ నెయ్యి తయారు చేసే ఈ విధానమే ఆమెను బిజినెస్ ఉమెన్‌ని చేసింది.
కమల్జీత్ కౌర్ గీ బిజినెస్ అనతి కాలంలోనే అత్యంత ప్రజాధరణ పొందింది. ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తోన్న నెయ్యి కావడంతో డిమాండ్ పెరిగింది. విదేశాల నుంచి సైతం ఆర్డర్స్ మొదలయ్యాయి. 220 Ml, 500 ml, 1 లీటర్.. ఇలా మూడు వేర్వేరు పరిమాణాల్లో బాటిల్స్ ప్యాక్ చేసి విక్రయించడం మొదలుపెట్టారు. ఒక్కోసారి ఆర్డర్ సంఖ్యను బట్టి ధరలో కూడా హెచ్చుతగ్గులు ఉంటుంటాయి.
ఇది కూడా చదవండి : Highest Paid Salary Jobs: మన దేశంలో ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్స్ ఏంటో తెలుసా ?
కమల్జీత్ కౌర్ కుమారుడు ఆమె కంపెనీకి సీటీఓగా వ్యవహరిస్తున్నాడు. 2021 లో నెలకు 20 లక్షలు దాకా సంపాదించడంతో పాటు ఆ ఒక్క ఏడాదిలోనే నెలకు 4500 బాటిల్స్ వరకు విక్రయించే వాళ్లం అని కమల్జీత్ కౌర్ కుమారుడు చెప్పకొచ్చాడు. తనకు వచ్చే ఆదాయంలో 1 శాతం లాభాన్ని గురుద్వారాలో అన్నార్థుల ఆకలిని తీర్చడం కోసం విరాళంగా అందిస్తూ తనలోని మంచితనాన్ని కూడా పంచిపెడుతున్న కమల్జీత్ కౌర్‌కి.. ఆమె బిజినెస్ ఐడియాకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం కదా.. ఇప్పుడు చెప్పండి మహిళలు తల్చుకుంటే ఏమైనా చేయగలరో లేదో..
ఇది కూడా చదవండి : Dangerous Black King Cobra: భయంకరమైన, లావుగా ఉన్న నల్లత్రాచు పామును ఎంత సింపుల్‌గా పట్టేసిండో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK