Jio vs Airtel 5G Plans: రోజూ 3GB డేటా ఇచ్చే ప్లాన్స్.. ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ?

Jio vs Airtel 5G Plans: 5G స్పీడ్‌తో డైలీ 3GB డేటా అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్‌తో కేవలం ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్‌లు మాత్రమే రావడం లేదండోయ్.. మీకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ అందించేలా ఓటిటి మాధ్యమాలకు యాక్సెస్ కూడా వెంట తీసుకొస్తున్నాయి. ఇక మీరు తెలుసుకోవాల్సిందల్లా.. ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటనేదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 05:00 AM IST
Jio vs Airtel 5G Plans: రోజూ 3GB డేటా ఇచ్చే ప్లాన్స్.. ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ?

Jio vs Airtel 5G Plans: 5G ఫోన్ కోసం, 5G స్పీడ్ కోసం కేవలం 5జి ఇంటర్నెట్ అందించే నెట్‌వర్క్ ఒక్కటే ఎంచుకుంటే సరిపోదు.. ఎందుకంటే 5G స్పీడ్‌తో వచ్చే ఇంటర్నెట్ అంతే త్వరగా ఖర్చయిపోతుంది కనుక. అలాంటప్పుడు సాధారణ ప్లాన్స్ తరహాలో 1.5GB లేదా 2GB డేటా ప్యాక్స్ ఏ మాత్రం సరిపోవు. అందులోనూ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎక్కువగా చేస్తూ, ఓటిటిలో సినిమాలు వెబ్‌సిరీస్‌లు చూసే వారికి ఈ సాధారణ ప్లాన్స్ అస్సలే సరిపోవు. అందుకే అలాంటి కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా జియో, ఎయిర్ టెల్ టెలికాం నెట్‌వర్క్స్‌లో రోజుకు 3GB డేటా అందించే 5G ప్లాన్స్ గురించి ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం.

5G స్పీడ్‌తో డైలీ 3GB డేటా అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్‌తో కేవలం ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్‌లు మాత్రమే రావడం లేదండోయ్.. మీకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ అందించేలా ఓటిటి మాధ్యమాలకు యాక్సెస్ కూడా వెంట తీసుకొస్తున్నాయి. ఇక మీరు తెలుసుకోవాల్సిందల్లా.. ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటనేదే.

జియోలో డైలీ 3GB డేటా అందించే ప్లాన్స్ ఏంటంటే..
రూ.419 రీచార్జ్ ప్లాన్: 28 రోజుల పాటు నిత్యం 3GB చొప్పున మొత్తం 84GB 5G డేటా అందించే ఈ రిచార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ , నిత్యం 100 ఉచిత SMS సౌకర్యం పొందవచ్చు. రోజు వారి డేటా లిమిట్ పూర్తయిన తరువాత 64kbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. ఇదేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి యాక్సెస్ కూడా లభిస్తుంది. 

రూ. 1199 రీచార్జ్ ప్లాన్: 84 రోజుల కాల పరిమితి కలిగిన ఈ రీచార్జ్ ప్లాన్‌తో నిత్యం 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 252GB డేటా లభిస్తుంది. డైలీ లిమిట్ పూర్తయిన అనంతరం 64kbps స్పీడ్‌తో డేటా యూజ్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ లాంటివి యధావిధిగా వర్తిస్తాయి. 

డైలీ 3GB డేటా అందించే ఎయిర్‌టెల్ రీచార్జ్ ప్లాన్స్ ఏంటంటే..
రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్: జియో తరహాలోనే ఈ రీచార్జ్ కార్డుతో కూడా 28 రోజుల పాటు నిత్యం 3జిబి హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇవే కాకుండా ఇంకెన్నో అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్‌తో లభిస్తాయి. అవేంటంటే.. 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కి ఉచితంగా సబ్‌స్క్రిప్షన్, 28 రోజుల పాటు ఎక్స్‌ట్రీమ్ యాప్ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7, వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్‌తో పాటు ఫాస్టాగ్ రీచార్జ్‌పై రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్స్ కూడా అందిస్తోంది.

రూ. 699 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 56 రోజుల పాటు నిత్యం 3GB హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇవే కాకుండా 56 రోజుల పాటు అమేజాన్ ప్రైమ్, ఎక్స్‌ట్రీమ్ యాప్ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7, వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్, ఫాస్టాగ్ రీచార్జ్‌పై రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్స్ యధావిధిగా లభిస్తాయి. జియో vs ఎయిర్‌టెల్ ఆఫర్స్‌ వివరాలకు సంబంధించి మరిన్ని టారిఫ్స్ గురించి తరువాత తెలుసుకుందాం. 

ఇది కూడా చదవండి : Aadhaar Card Update News: ఆధార్ కార్డుదారులకు ముఖ్యమైన గమనిక

ఇది కూడా చదవండి : OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11R కోసం వెయిట్ చేయలేకపోతున్నారా ?

ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..

ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News