Jio Cheapest 3 Months Plan: జియో 84 రోజుల రీఛార్జీ ప్లాన్ కేవలం తక్కువ ధరలోనే తీసుకువచ్చింది. ఈ ప్లాన్ జీయో పోర్టల్ లేదా మైజియో యాప్ ద్వారా యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే వినియోగదారులు అపరిమిత కాలింగ్, లోకల్, ఎస్టీడీ కాలింగ్ కూడా పొందుతారు. కేవలం రూ.479 రీఛార్జీ ప్లానతో ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.
జియో రూ.479 ప్లాన్..
జియో రూ.479 రీఛార్జీ ప్లాన్‌లో మీరు మొత్తం 6 జీబీ డేటా పొందుతారు. దీంతోపాటు 1000 ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా ఉచితంగా పొందవచ్చు. జియో సినిమా ప్రీమియం మెంబర్షిప్ మాత్రం చేర్చలేదు. కేవలం కాలింగ్‌కు మాత్రమే వినియోగించుకునే యూజర్లకు ఇది అద్భుతమైన ప్లాన్.
జియో రూ.799 రీఛార్జీ ప్లాన్..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులు గతంతో దీని ధర రూ.666 ఉండేది. టెలికాం ధరలు పెరిగి తర్వాత రూ.799 అయింది. ఈ రీఛార్జీ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ 84 రోజులపాటు పొందుతారు. ఇందులో 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ప్రతి రోజు లభిస్తుంది. అంతేకాదు ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా లభిస్తుంది. అయితే, ఈ బెనిఫిట్స్‌తో మరో రీఛార్జీ ప్యాక్ కూడా ఉంది రూ.666 కానీ, దీని వ్యాలిడిటీ కేవలం 70 రోజులు మాత్రమే వర్తిస్తుంది.
జియో ఈ మధ్య కాంబో ప్లాన్ కూడా పరిచయం చేసింది. ఈ దిగ్గజ కంపెనీ ప్లాన్‌లో మీరు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వెర్షన్ కూడా పొందుతారు. ఇందులో వేల సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఉచితంగా చూడవచ్చు.
ఇదీ చదవండి: ఈ ఒక్క బిజినెస్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. లక్షల్లో ఆమ్దాని తెస్తుంది..!
ఈ ప్లాన్ ధర రూ.1299 దీని వ్యాలిడిటీ 84 రోజులు వర్తిస్తుంది. ఇందులో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. అపరిమిత కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు. ఈ జియో ప్లాన్‌లో 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందవచ్చు. జియో టీవీ ఫ్రీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా అదనంగా పొందుతారు. ఒకవేళ మీ ప్రాంతంలో 5 జీ నెట్వర్క్ ఉంటే 5 జీ స్పీడ్‌తో డేటా వినియోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: ఎక్కువ మంది ఎగబడి మరీ రీఛార్జీ చేసుకుంటున్న ప్లాన్ ఇదే.. దీని బంపర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
జియో ఇంటర్నెషన్ రోమింగ్ ప్యాక్ కూడా పరిచయం చేసింది. కెనడ, యూఏఈ, థాయిలాండ్, సౌదీ అరేబియాకు ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఈ దేశాలకు వెళ్లినప్పుడు కూడా ఉచితంగా అపరిమిత ఎస్ఎంఎస్, అవుట్ గోయింగ్ కాల్స్ బెనిఫిట్స్ పొందుతారు. ఏ దేశం నుంచి అయినా ప్రీ గా ఇన్కమింగ్ కాల్స్, వైఫై కాలింగ్ సౌకర్యం కూడా కలదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.