Jio Book Laptop: టెలికాం రంగంలో జియో క్రేజే వేరు. అది మార్కెట్లో ఏది లాంఛ్ చేసిన అది ఒక సంచలనమే. భారత మార్కెట్లలోకి మరో సంచలనానికి తెరతీయనుంది జియో(Jio). రిలయన్స్ 44 వ ఏజీఎమ్ సమావేశంలో అతి తక్కువ ధరకే జియో ఫోన్ నెక్ట్స్(Jio Phone Next)ను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటుగా జియోబుక్ ల్యాప్‌టాప్‌ను కూడా ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఏజీఎమ్ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) జియోబుక్ గురించి ఏలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారత మార్కెట్లలోకి జియోబుక్ ల్యాప్‌టాప్(Jio Book Laptop)ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయనుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Zomato: నిత్యావసర సేవలకు జొమాటో గుడ్ బై...ఈ నెల 17 నుంచి సేవలు నిలిపివేత
మూడు వేరియంట్లలో జియో బుక్...!
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో సర్టిఫికేషన్ కోసం జియోబుక్ ల్యాప్‌టాప్(Jio Book Laptop) వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్ మూడు వేరియంట్లు బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్‌లో కంపెనీ లిస్ట్ చేసింది. కాగా జియో ల్యాప్‌టాప్ లాంచ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. జియోబుక్ 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో వస్తుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్ ర్యామ్, 64 జీబీ రామ్ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్ ధర ఇంకా తెలియాల్సి ఉండగా తక్కువ ధరల్లోనే జియోబుక్ ఉంటుందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జియోబుక్ సర్టిఫికేషన్‌లో భాగంగా మూడు వేరియంట్లతో NB1118QMW, NB1148QMW, NB1112MM బీఐఎస్ వెబ్‌సైట్‌లో లిస్ట్ ఐనట్లు టిప్‌స్టార్ ముకుల్ శర్మ వెల్లడించారు.
స్పెఫికేషన్లు అంచనా..!
జియోబుక్ ల్యాప్‌టాప్ హెచ్‌డీ (1,366x768 పిక్సెల్స్) డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 664 ఎస్‌ఓసీ ప్రాసెసర్
4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
మినీ హెచ్‌డీఎమ్‌ఐ కనెక్టర్
డ్యూయల్‌బ్యాండ్ వైఫై
బ్లూటూత్ సపోర్ట్
ప్రీ ఇన్‌స్టాల్‌డ్ జియో యాప్స్
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఆఫీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook