Income Tax Returns Deadline: ఐటీఆర్ ఫైలింగ్‌కు ఒక్క రోజే గడువు మిగిలింది. రేపటితో గడువు ముగిసిపోనుంది. ఆదివారం వరకు దాదాపు ఆరు కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్‌లు) దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రస్తుతానికి గడువును పొడిగించే అవకాశాలు లేకపోవడంతో అందరూ త్వరితగతిన ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ట్యాక్స్ పేయర్లు తొందరపడుతున్నారు. గతేడాది కూడా గడువు పొడిగించలేని విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం వరకు గతేడాది జూలై 31 వరకు దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్యను దాటి.. 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
ఆదాయపు పన్ను శాఖ డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (AY 2023-24) రికార్డు స్థాయిలో పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే తమ ఐటీఆర్‌లను దాఖలు చేశారు. అలాగే భారీ సంఖ్యలో ఐటీఆర్ రీఫండ్ కూడా పొందారు. జూలై 31 తరువాత గడువు తేదీని పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం లేదని నిపుణులు చెబుతుండడంతో ట్యాక్స్ పేయర్లు రేపటిలోగా తమ రిటర్న్‌లను ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అనేక పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
"ఒక కొత్త మైలురాయి..! ఇప్పటివరకు (జూలై 30) 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. అందులో ఈరోజు సాయంత్రం 6.30 గంటల వరకు దాదాపు 26.76 లక్షల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. ఈరోజు సాయంత్రం 6.30 గంటల వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో 1.30 కోట్లకు పైగా విజయవంతమైన లాగిన్‌లను చూశాం" అని ఆదాయపు పన్ను శాఖ సాయంత్రం మరో ట్వీట్‌లో వెల్లడించింది.
ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం ట్యాక్స్ పేయర్లకు సహాయం చేయడానికి హెల్ప్‌డెస్క్ 24×7 ప్రాతిపదికన పని చేస్తుంది. కాల్‌లు, లైవ్ చాట్‌లు, WebEx సెషన్‌లు, సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందిస్తున్నామని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఈ మైలురాయిని చేరుకోవడంలో తమకు సహాయం చేసినందుకు ట్యాక్స్ పేయర్లకు,పన్ను నిపుణులకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించింది. ఐటీఆర్ ఫైల్ చేయని వారందరూ చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి వీలైనంత త్వరగా ఫైల్ చేయాలని కోరింది.
Also Read: Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?
Also Read: Train Travel Insurance: 35 పైసలతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి