ITR Filing: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గమనిక.. రూ.50 వేలు సేవ్ చేసుకోండి

Tax Standard Deduction: ఐటీఆర్ ఫైలింగ్‌లో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ డబ్బు క్లెయిమ్ చేయడానికి ఎలాంటి పత్రాలు కూడా అవసరం లేదు. జీతం తీసుకునే వ్యక్తులతోపాటు పెన్షనర్లు కూడా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 06:45 PM IST
ITR Filing: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గమనిక.. రూ.50 వేలు సేవ్ చేసుకోండి

Tax Standard Deduction: కొత్త ఆదాయ పన్ను విధానంలో ట్యాక్స్ పేయర్స్ స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఈ నిర్ణయంతో  స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. సెక్షన్ 80సీ, 80డీ, 80డీడీబీ, ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని ఇతర నిబంధనల కింద అందించిన వివిధ మినహాయింపుల చాలామందికి తెలుసు. కానీ.. పన్ను చెల్లింపుదారులందరూ ఎలాంటి పెట్టుబడి లేకుండా కూడా స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చనే విషయం తెలుసా..? పూర్తి వివరాలు ఇలా..

సెక్షన్ 80సీ కింద అందించిన మినహాయింపును క్లెయిమ్ చేయడం ద్వారా మీరు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవడానికి ఈజీ మార్గం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), ఇతర రకాల ఇన్‌స్ట్రుమెంట్‌లలో చేసిన పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవడానికి రెండో అత్యంత ఈజీ మార్గం సెక్షన్ 80డీ. ఈ విభాగంలో స్వీయ, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై మినహాయింపును పొందవచ్చు. ఈ సెక్షన్ కింద లభించే గరిష్ట మినహాయింపు రూ.25 వేలు, సీనియర్ సిటిజన్లకు రూ.50 వేలు ఉంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 16 ప్రకారం.. జీతం పొందిన వ్యక్తి తన ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయంపై ప్రామాణిక మినహాయింపును పొందవచ్చు. దీనిని క్లెయిమ్ చేయడానికి మీరు ఎలాంటి పత్రాలు లేదా పెట్టుబడి రుజువును సమర్పించాల్సిన అవసరం లేదు. ఎవరైనా పెన్షనర్ అయితే.. అతను కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం మీరు బీమాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పెట్టుబడికి సంబంధించిన ఆధారాన్ని చూపించాల్సిన అవసరం కూడా లేదు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్టాండర్డ్ డిడక్షన్‌ను మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. మీరు ఏమీ చేయకుండానే రూ.50 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ట్యాక్స్ స్లాబ్ కిందకు వచ్చే జీతాలు పొందే వ్యక్తులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  

ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి కూడా ఈ ప్రయోజనం అందుబాటులోకి తీసుకువచ్చారు. మీరు ఏ ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్నా.. మీరు రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయడానికి అర్హులవుతారు. కొత్త పన్ను విధానంలో  ట్యాక్స్ మినహాయింపు పరిమితిని కూడా 3 రూపాయలకు లక్షలకు పెంచారు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ.

Also Read: Umesh Yadav: ఉమేష్‌ యాదవ్ ఇంట పండుగ వాతావరణం.. విషాద సమయంలో గుడ్‌న్యూస్   

Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook 

Trending News