IT Jobs Offers: ఇలాంటి జాబ్స్ విషయంలో జర జాగ్రత్త!

IT Jobs Offers: ఐటీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీనితో ఐటీ శాఖ అప్రమత్తమై ఉద్యోగాల నియామకాలపై క్లారిటీ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 08:10 PM IST
  • ఐటీలో ఉద్యోగాల పేరుతో మోసాలు
  • అప్రమత్తమైన ఐటీ శాఖ
  • పబ్లిక్​ నోటీసు జారీ..
IT Jobs Offers: ఇలాంటి జాబ్స్ విషయంలో జర జాగ్రత్త!

IT Jobs Offers: ఇన్​కం ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ (ఐటీ విభాగం) మంగళవారం నకిలీ ఉద్యోగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఇటీవల ఐటీలో ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించి ఈ మేరకు ఈ ప్రకటన చేసింది.

ఐటీ జారీ చేసిన పబ్లిక్ నోటీసును​ ట్విట్టర్ హ్యాండిల్​లో కూడా షేర్​ చేసింది.

నోటీసులో ఏముందంటే..

ఐటీ శాఖలో చేరేందుకు నకిలీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది ఐటీ విభాగం. నకిలీ అపాయిట్​మెంట్స్​తో కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఐటీ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగం చేర్పిస్తామంటూ.. డబ్బులు అడుగుతున్నారని తెలిపింది. అలాంటి ఆఫర్లను అస్సలు నమ్మొద్దని స్పష్టం చేసింది.

ఐటీ డిపార్ట్​మెంట్​లో ఎంపిక ఎలా ఉంటుంది?

ఐటీ డిపార్ట్​మెంట్ జారీ చేసిన నోటీస్​ ప్రకారం.. ఐటీ డిపార్ట్​మెంట్​లో చేరాలనుకునే వారికి గ్రూప్​ బీ, గ్రూప్​ సీ పోస్ట్​ పోస్ట్​లకు సంబంధించి స్టాఫ్​ సెలక్షన్ కమిషన్ ద్వారా  ఎంపిక విధానం ఉంటుంది. ఎస్​ఎస్​సీ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

 ఐటీ డిపార్ట్​మెంట్​లో గ్రూప్​ బి, సీ పోస్టులకోసం.. నోటిఫికేషన్, ఫలితాలు అన్నీ ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది.

ఐటీ వెబ్​సైట్లో ఎంపికైన అభ్యర్థుల పేర్లు..

ఎస్​ఎస్​ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల పేర్లు, కేటాయించిన ప్రాంతాల జాబితాను ఐటీ అధికారిక వెబ్​సైట్​ (https:// incometaxindia.gov.in)లో అప్​లోడ్ చేస్తారని ఐటీ శాఖ పేర్కొంది.

ఎస్​ఎస్​సీ, ఐటీ వెబ్​సైట్లలో తప్పా..

ఎస్​ఎస్​సీ, ఐటీ వెబ్​సైట్లలో తప్పా.. మరే ఇతర ప్లాట్​ఫామ్​లపైన కూడా.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఉద్యోగ నియామకాల సమాచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది ఐటీ శాఖ.

Also read: LPG Price Hike: సామాన్యులపై మరో భారం.. రెట్టింపు అవ్వనున్న గ్యాస్ సిలిండర్ ధర.. ఎప్పటినుండంటే..??

Also read: Smart Phones: రూ.15 వేల లోపు బెస్ట్ కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్స్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News