IRCTC Ooty Package: శీతాకాలంలో ఊటీ అందాలు ఆస్వాదించే అద్భుత ప్యాకేజ్ మీ కోసం

IRCTC Ooty Package: శీతాకాలం పర్యాటకానికి చాలా అనువుగా, ఆహ్లాదంగా ఉంటుంది. శీతల ప్రదేశాలు, హిల్ స్టేషన్లలో చలికాలాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు. దేశంలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్ ప్రాంతంగా చెప్పుకునే ఊటీకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మీ కోసం బెస్ట్ ప్లాన్స్ అందిస్తున్నాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2023, 09:33 AM IST
IRCTC Ooty Package: శీతాకాలంలో ఊటీ అందాలు ఆస్వాదించే అద్భుత ప్యాకేజ్ మీ కోసం

IRCTC Ooty Package: వింటర్ డెస్టినేషన్ ఊటీ కోసం ఐఆర్సీటీసీ మంచి ఆకర్షణీయమైన ప్యాకేజ్ అందిస్తోంది. కొత్త ఏడాది ప్రారంభంలో ఊటీ అందాలు ఆస్వాదించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి. 

పర్యాటకానికి శీతాకాలం చాలా అనువైంది. నిస్సందేహంగా చలికాలంలో ఆహ్లాదం, అందాలు రెట్టింపవుతుంటాయి. దక్షిణాదిన అందమైన, ఆకర్షణీయమైన హిల్ స్టేషన్‌గా ఉన్న ఊటీ దర్శించాలనుకుంటే ఇదే అనువైన సమయం. అందుకే ఐఆర్సీటీసీ ఆకర్షణీయమైన ప్యాకేజ్ అందిస్తోంది. ఊటీ అన్‌లిమిటెడ్ పేరుతో ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఊటీతో పాటు కోయంబత్తూరు, కూనూరు అందాల్ని ఆస్వాదించవచ్చు. మొదటి రోజు 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ద్వారా కోయంబత్తూరు తీసుకువెళ్తారు. అక్కడ కొన్ని ప్రాంతాల సందర్శన తరువాత ఊటీకు పయనం ఉంటుంది. అంటే మొదటి రోజు రాత్రి బస ఊటీలోనే ఉంటుంది. ఇక రెండవరోజు ఊటీలో దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ వంటి చూసి రెండో రోజు రాత్రి, మూడో రోజు రాత్రి కూడా అక్కడే బస ఉంటుంది. అంటే ఊటీలో మూడు రాత్రులు, రెండు పగలు గడపవచ్చు. 

ఇక ఊటీ అన్‌లిమిటెడ్ ప్యాకేజ్‌లో భాగంగా నాలుగోరోజు కూనూరులో అందమైన ప్రాంతాల సందర్శన ఉంటుంది. సాయంత్రం కోయంబత్తూరు నుంచి తిరిగి హైదరాబాద్‌కు ఫ్లైట్ ఉంటుంది. అంటే మొత్తం ప్యాకేజ్‌లో నాలుగు పగలు, మూడు రాత్రులతో ఉంటుంది. ఇందులో మూడు రాత్రులు ఊటీలోనే బస ఉండటంతో ఊటీలో ఉదయం అందాల్ని అద్భుతంగా ఆస్వాదించవచ్చు.

ఊటీ అన్‌లిమిటెడ్ ప్యాకేజ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే ఒక్కొక్కరికి 24,850 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 25,450 రూపాయలు, సింగిల్ ఆక్యుపెన్సీ అయితే ఒక్కొక్కరికి 32,600 రూపాయలుంటుంది. ఫ్లైట్ టికెట్స్, ఊటీలో వసతి, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ ఈ ప్యాకేజ్‌లో ఉంటాయి. మీక్కూడా వింటర్ డెస్టినేషన్ ఊటీ పర్యటన ప్లానింగ్ ఉంటే ఐఆర్సీటీసీ అందించే ఈ ప్యాకేజ్ కోసం https://www.irctctourism.com/ సందర్శించి బుక్ చేసుకోవచ్చు. 

Also read: Year Ender 2023: ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన బెస్ట్ కార్లు ఇవే.. దిమ్మతిరిగే ఫీచర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News