iPhone 14 Price Offers: ఐఫోన్ 14 పై సంక్రాంతి ధమాకా.. 44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్

iPhone 14 Price Offers: ఐఫోన్ 14 కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సంక్రాంతి 2023 ఫెస్టివల్‌తో పాటు రిపబ్లిక్ డే సేల్ 2023 కూడా సమీపిస్తుండటంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి పరికరాలపై ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ పోటాపోటీగా ఆఫర్స్ అందిస్తున్నాయి.

Written by - Pavan | Last Updated : Jan 14, 2023, 06:32 AM IST
iPhone 14 Price Offers: ఐఫోన్ 14 పై సంక్రాంతి ధమాకా.. 44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్

iPhone 14 Price Offers: ఐఫోన్ అంటేనే ఓ సెపరేటు క్రేజ్. ఐఫోన్స్‌కి ఉండే డిమాండ్, క్రేజ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒకవేళ ఏదైనా బ్యాడ్ టైమ్‌ వస్తే.. జేబులో డబ్బులు ఉన్నా లేకున్నా చేతిలో ఐఫోన్ ఉంటే చాలు.. డాబు, దర్పం వాటంతటవే వెంట నడుచుకుంటూ వస్తాయనేంత క్రేజ్. అందుకే లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎంత ఎక్కువయినా వెచ్చించి సొంతం చేసుకుంటారు. అయితే, ఐఫోన్ కోసం ఎక్కువ వెచ్చించలేని వాళ్లు మాత్రం డిస్కౌంట్స్ లేదా ఇతర ఫెస్టివల్ ఆఫర్స్ సేల్ వస్తే.. ఆ ఆఫర్స్ పై కొనేద్దామని ప్లాన్ చేసుకుంటుంటారు.

ఐఫోన్ 14 కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సంక్రాంతి 2023 ఫెస్టివల్‌తో పాటు రిపబ్లిక్ డే సేల్ 2023 కూడా సమీపిస్తుండటంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి పరికరాలపై ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ పోటాపోటీగా ఆఫర్స్ అందిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 14 ఒరిజినల్ ధర 79,900 రూపాయలుగా కాగా.. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ధర రూ. 73,990 కి చేరింది. అంతేకాకుండా ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద మరో రూ. 23 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. ఇదే కాకుండా ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ ఫోన్ల ఎక్స్‌చేంజ్‌పై అదనంగా రూ. 3 వేలు డిస్కౌంట్ ఆఫర్ కల్పిస్తోంది. ఈ డిస్కౌంట్స్ అన్ని కలిపి మొత్తం రూ. 31,910 అవుతోంది. అంటే కేవలం 90 రూపాయలు తక్కువ 32 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అన్నమాట. ఈ భారీ డిస్కౌంట్ పోగా.. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఆఫర్స్ ప్రకారం ఐఫోన్ 14ని రూ 47,990 కే సొంతం చేసుకోవచ్చన్నమాట.

అమేజాన్‌లోనూ ఐఫోన్ 14 పై ఆఫర్స్
128GB ఐఫోన్ వేరియంట్ ధర రూ. 79,900 గా ఉండగా.. అమేజాన్ ఈ ఐఫోన్‌ని 73,900 రూపాయలకే అందిస్తోంది. అంటే ఏ ఆఫర్ వర్తింపచేయకుండానే అమేజాన్ వెబ్‌సైట్ ఈ ఐఫోన్‌పై 6 వేల ఆఫర్ ఇచ్చేసింది. ఆ తరువాత ఒకవేళ మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్ అయినట్టయితే.. మీకు రూ. 4 వేల వరకు ఇమ్మిడియెట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా స్మార్ట్ ఫోన్స్ ఎక్స్‌చేంజ్‌పై రూ. 18 వేల వరకు ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ అన్నీ కలిపితే మొత్తం 28 వేల రూపాయల వరకు ఆఫర్ అందుబాటులో ఉంది.  

ఇమాజిన్ స్టోర్‌లో ఐఫోన్ 14 పై అద్దిరిపోయే ఆఫర్స్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోయే ఇమాజిన్ స్టోర్ ఆఫర్. ఇమాజిన్ స్టోర్‌లో ఐఫోన్ 14 బేసిక్ వేరియంట్ ధర రూ. 74,900 గా ఉంది. అంటే ఆల్రెడీ 5 వేల డిస్కౌంట్ వచ్చేసింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీ వద్ద హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కార్డ్స్ ఉన్నట్టయితే.. మీకు రూ. 4 వేల వరకు ఇమ్మిడియెట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇక ఇప్పుడు చెప్పుకునేదే అసలు సంక్రాంతి ధమాకా ఆఫర్ లాంటిది. అవును.. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఐఫోన్‌పై రూ. 35 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది ఇమాజిన్ స్టోర్. అయితే మీ ప్రస్తుత ఐఫోన్ వర్కింగ్ కండిషన్‌ని బట్టే ఆ ధర నిర్ణయిస్తారనే విషయం మర్చిపోవద్దు.

ఈ డిస్కౌంట్స్ అన్నీ కలిపి ఇమాజిన్ స్టోర్‌లో మొత్తం 44 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్స్ అన్నింటికి మీరు ఎలిజిబుల్ అయితే.. కేవలం 36 వేలకే ఐఫోన్ మీ సొంతం అవుతుంది. సంక్రాంతి పండగ కానుకగా అయిన వారికి, స్నేహితులకు ఐఫోన్ 14 ని గిఫ్టుగా అందివ్వాలనుకునే వారికి ఇవి రైట్ ఆఫర్స్ కదా. సంక్రాంతి అసలు ధమాకా అంటే ఇదే కదా మరి.

ఇది కూడా చదవండి : 2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?

ఇది కూడా చదవండి : Aadhaar Card Important News: మీ ఆధార్ కార్డ్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోండిలా

ఇది కూడా చదవండి : Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News