iPhone 14 Max Price: ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్.. ఎంతో తెలిస్తే షాకే! స్పెసిఫికేషన్‌లు ఇవే

iPhone 14, iPhone 14 Max Price and Specifications leaked. ఐఫోన్ 14 మొబైల్ 6 GB + 128 GB వేరియెంట్ ధర దాదాపు 799 డాలర్లు ఉన్నట్లు టిప్‌స్టర్ తమ ప్రకటనలో పేర్కొంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 09:31 AM IST
  • ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్
  • ఐఫోన్ 14 మాక్స్ ధర తెలిస్తే షాకే
  • ఐఫోన్ 14 మాక్స్ స్పెసిఫికేషన్‌లు ఇవే
iPhone 14 Max Price: ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్.. ఎంతో తెలిస్తే షాకే! స్పెసిఫికేషన్‌లు ఇవే

iPhone 14 Max Price and Specifications leaked in online: 'ఆపిల్ ఐఫోన్' అంటే ఇష్టపడిన వారుండరు. కొత్త సిరీస్ వచ్చిందంటే మొబైల్ ప్రియులు కొనుగులు చేసేందుకు ఆసక్తిగా ఉంటారు. ముఖ్యంగా ఐఫోన్ 14 సిరీస్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌లో చాలా అప్‌గ్రేడ్లు ఉంటాయని సమాచారమే అందుకు కారణం. 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ రానున్నాయని తెలుస్తోంది. అయితే ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌ ధర, స్పెసిఫికేషన్లు నెట్టింట లీక్ అయ్యాయి. 

ఐఫోన్ 14 మొబైల్ 6 GB + 128 GB వేరియెంట్ ధర దాదాపు 799 డాలర్లు ఉన్నట్లు టిప్‌స్టర్ తమ ప్రకటనలో పేర్కొంది. భారత కరెన్సీలో ఇది దాదాపుగా రూ.62,000లుగా ఉండనుంది. ఇక ఐఫోన్ 14 మ్యాక్స్‌ 6 GB + 128 GB వేరియెంట్ ధర 899 డాలర్లు ఉండనుందట. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.70,000. వేరే వేరియంట్ల ధర ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంపై యాపిల్ అధికారికంగా ప్రకటించకున్నా.. దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయని తెలుస్తోంది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఐఫోన్‌ల ధరలు దాదాపు 20 శాతం అధికంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.

iPhone 14 Specifications:
# 6.06 అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED స్క్రీన్
# 2532×1170 రిజల్యూషన్ & 460 PPI
# 120Hz రిఫ్రెష్ రేట్
# A15 బయోనిక్ (5nm TSMC)
# 6GB LPDDR4X ర్యామ్
# 128GB/256GB స్టోరేజ్
# ఫేస్ ఐడి 
# డ్యూయల్ రియర్ కెమెరా [12MP+12MP(UW)]
# నాచ్ డిజైన్

iPhone 14 Max Specifications:
# 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED స్క్రీన్
# 2778×1284 రిజల్యూషన్ & 458 PPI
# 90Hz రిఫ్రెష్ రేట్
# A15 బయోనిక్ (5nm TSMC)
# 6GB LPDDR4X ర్యామ్
# 128GB/256GB స్టోరేజ్
# డ్యూయల్ రియర్ కెమెరా (12MP+12MP)
#ఫేస్ ఐడి 
# నాచ్ డిజైన్

Also Read: Teenmar Mallanna Arrest: జనగాంలో తీన్మార్ మల్లన్న అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు!

Also Read: Sonakshi Sinha Engagement: వైరల్ ఫొటోస్.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో సోనాక్షి సిన్హా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News