Indian Bank Car Loan Offers: ప్రస్తుతం కారు అనేది ఓ అవసరంగా మారిపోయింది. అందుకే కారు లోన్స్ కోసం వివిధ బ్యాంకులు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెడుతుంటాయి. ఇందులో భాగంగానే..ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీతో ఇండియన్ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది.
బ్యాంకింగ్ సెక్టార్ అనేది ప్రభుత్వ, ప్రైవేటు బేధం లేకుండా అన్నింటికీ పోటీ వాతావరణం నెలకొంది. ప్రతి బ్యాంకుకు ఏడాదికి చేసే బిజినెస్‌పై టార్గెట్ ఉంటుంది. అందుకే ప్రజల నిత్యావసరాలైన సొంత ఇల్లు, కారు వంటివి కొనుగోలు చేసేందుకు వివిధ బ్యాంకులు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఇండియన్ బ్యాంకు..మారుతి సుజుకీతో చేతులు కలిపింది. ఆకర్షణీయైన బ్యాంకు రుణాలు ప్రకటించింది. ఆన్‌రోడ్ ధరలో 90 శాతం వరకూ రుణాలు పొందేలా పథకాలు అందిస్తోంది.
మారుతి సుజుకీ-ఇండియన్ బ్యాంక్ ఒప్పందంతో ప్రయోజనాలు
ఇండియన్ బ్యాంకు నేరుగా మారుతి సుజుకీతో ఒప్పందం వల్ల కస్టమర్లకు మరింత సులభంగా లోన్ అందుతుంది. దేశవ్యాప్తంగా 5 వేల 7 వందల బ్రాంచిలలో కారు లోన్ పొందే అవకాశం కలుగుతుంది. కారు లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజు, ఫ్రీ ఫాస్టాగ్ వంటివి కస్టమర్‌కు అదనంగా అందనున్నాయి.30 లక్షల వరకూ ఫ్రీ ఇన్సూరెన్స్, సులభమైన వాయిదా పద్ధతులు అందుతాయి. ఫైనాన్స్ విషయంలో కస్టమర్లకు ఇబ్బందులు ఎక్కువగా కలగవు. సులభంగా లోన్ అందుతుంది. అంతేకాకుండా 84 నెలల వరకూ లోన్ టెన్యూర్ తీసుకోవచ్చు. 2022 జూన్ 30 వరకూ మాత్రమే ఇండియన్ బ్యాంకు ఆఫర్ వర్తిస్తుంది. మారుతి సుజుకీ సంస్థకు దేశవ్యాప్తంగా 2 వేల 156 నగరాలు పట్టణాలు, నగరాల్లో 3 వేల 357 రిటైల్ అవుట్ లెట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సంస్థ దేశంలోని 12 ప్రభుత్వం, 11 ప్రైవేట్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని ఉంది.
Also read: వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టిన బంగారం, పసిడి ధరలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.