Tax Saving tips: ఇలా చేస్తే వార్షిక ఆదాయం 10.50 లక్షలున్నా సరే ట్యాక్స్ చెల్లించనక్కరలేదు

Tax Saving tips: ఉద్యోగస్తులకు జీతాలు పెరిగేకొద్దీ ట్యాక్స్ కోత దిగులు పట్టుకుంటుంది. మార్చ్ నెల వచ్చిందంటే చాలు భారీగా ఇన్‌కంటాక్స్ కట్ అవుతుంటుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మీ ఆదాయం 10 లక్షల రూపాయలున్నా సరే ట్యాక్స్ ఆదా చేయవచ్చంటున్నారు నిపుణులు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2024, 06:09 PM IST
Tax Saving tips: ఇలా చేస్తే వార్షిక ఆదాయం 10.50 లక్షలున్నా సరే ట్యాక్స్ చెల్లించనక్కరలేదు

Tax Saving tips: దేశంలో ప్రస్తుతం రెండు రకాల ట్యాక్స్ విధానాలున్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఒకటైతే రెండవది న్యూ ట్యూక్స్ రెజీమ్. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో ఏడాదికి 2.5 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదు. న్యూ ట్యాక్స్ రెజీమ్ అయితే 7 లక్షల వరకూ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఏడాది ఆదాయం 10 లక్షలుంటే ట్యాక్స్ కట్టాల్సిందేనా అనే ఆందోళన ఎక్కువౌతోంది. 

ట్యాక్స్ స్లాబ్ కంటే ఎక్కువ ఆదాయం ఉంటే తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. పాత ట్యాక్స్ విధానంలో ఏడాదికి 2.5 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదు. 2.5-5 లక్షల వరకూ ఆదాయముంటే 5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అదే 5-10 లక్షల వరకూ ఆదాయమైతే 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయమైతే 30 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అంటే ఏడాది ఆదాయం 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మీ ఏడాది ఆదాయం 10 లక్షలు దాటినా అంటే 10.50 లక్షలున్నా సరే ట్యాక్స్ మొత్తం సేవ్ చేయవచ్చు. కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు దీనికోసం అందుబాటులో ఉన్నాయి. 

10.50 లక్షల ఆదాయముంటే ట్యాక్స్ సేవ్ చేయడం ఎలా

స్టాండర్డ్ డిడక్షన్‌లో భాగంగా 50 వేలు రిబేట్ లభిస్తుంది. అంటే 10 లక్షల ఆదాయంపైనే ట్యాక్స్ వర్తిస్తుంది. పీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్‌సి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం ఏడాదికి 1.50 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. అంటే 10 లక్షల్లోంచి ఇది మినహాయిస్తే 8.50 లక్షలవుతుంది. 

నేషనల్ పెన్షన్ స్కీములో ఏడాదికి 50 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సిసిడి ప్రకారం మరో 50 వేల రూపాయలపై ట్యాక్స్ ఉండదు. అంటే ట్యాక్స్ పరిధిలో వచ్చే ఆదాయం 8 లక్షలవుతుంది. ఇప్పుడు మీకొక హోమ్ లోన్ ఉంటే ఏడాదికి 2 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపును సెక్షన్ 24బి ప్రకారం పొందవచ్చు. అంటే మీ ట్యాక్స్ ఆదాయం 6 లక్షలవుతుంది.

మెడికల్ పాలసీ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 డి ప్రకారం 25 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. మీ తల్లిదండ్రుల పేరుపై హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మరో 50 వేలు మినహాయింపు లభిస్తుంది. 6 లక్షల్లోంచి 75 లక్షలు మినహాయిస్తే 5.25 లక్షలు ట్యాక్స్ ఆదాయం అవుతుంది. ఏదైనా సంస్థకు విరాళమిస్తే ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80జి ప్రకారం 25 వేలు ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ట్యాక్స్ స్లాబ్ 5 లక్షల రూపాయలవుతుంది. అంటే ఇక మీరు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. 

Also read: Toyota Taisor: టయోటా నుంచి మరో అదిరిపోయే కారు.. లాంచ్ డేట్, ఫీచర్స్ వివరాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News