Income tax: జూలై 31లోగా ఐటీఆర్ ఫైలింగ్ కాలేదా, మరో మార్గముంది, ఏం చేయాలంటే

Income tax: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలుకు గడువు తేదీ అయిపోయింది. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయడం మిస్ అయుంటే పరిస్థితి ఏంటి. ఇంకో మార్గం లేదా, ఏం చేయాలనే ప్రశ్నలు తరచూ విన్ఫిస్తున్నాయి. దీనికి సమాధానం తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2023, 02:13 AM IST
Income tax: జూలై 31లోగా ఐటీఆర్ ఫైలింగ్ కాలేదా, మరో మార్గముంది, ఏం చేయాలంటే

Income tax: సకాలంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పెనాల్టీ చెల్లించడమే కాకుండా సహేతుకమైన కారణాల్ని వివరించగలగాలి. అదే సమయంలో ఐటీ రిటర్న్స్ ప్రక్రియలో ఆలస్యం జరిగితే వ్యాపారులకు పలు ఆటాంకాలు ఎదురౌతాయి. ఇప్పుడు గడువు తేదీ ముగిసిపోవడంతో మరో తేదీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే మార్గమేంటనేది తెలుసుకుందాం..

దేశంలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31తో గడువు ముగిసింది. నిర్ణీత గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయలేదని ఆందోళన చెందుతున్నారా..మరో మార్గం లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిర్ణీత గడువు తేదీలోగా రిటర్న్స్ పైల్ చేయకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జరిమానాతో పాటు కొన్ని షరతులతో ఐటీ రిటర్న్స్ పైల్ చేయవచ్చు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు 31 డిసెంబర్ 2023 మరో చివరి తేదీగా ఉంది. ఆయితే ఇది పెనాల్టీతో చెల్లించే తేదీ. జూలై 31లోగా ఐటీఆర్ చెల్లించనివాళ్లు జరిమానాతో డిసెంబర్ 31లోగా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 234 ఎఫ్ కింద 5 వేలు పెనాల్టీ ఉంటుంది.

డిసెంబర్ 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పెనాల్టీ రెండు విధాలుగా ఉంటుంది. ఇందులో 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే జరిమానా 1000 రూపాయలు. 5 వేలకు పైబడి ఆదాయం ఉంటే జరిమానా 5 వేల రూపాయలు. అయితే ఐటీ రిటర్న్స్ ఎప్పుడూ సమయానికి చెల్లించడం మంచి పద్ధతి. ఆలస్యంగా పైల్ చేయడం వల్ల వ్యాపారంలో ఉండేవారికి పలు ఇబ్బందులు ఎదురౌతాయి. పెనాల్టీతో ఫైల్ చేసే రిటర్న్స్‌కు ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద మినహాయింపు ఉండదు. పన్ను సకాలంలో చెల్లించి రిటర్న్స్ దాఖలు చేయలేకపోతే సమస్య అవుతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఇన్ కంటాక్స్ చట్టం 271 ఎఫ్ ప్రకారం నోటీసులు జారీ చేయవచ్చు. కేవలం నిర్ణీత జరిమానా చెల్లించకపోవడమే కాకుండా ఆలస్యమైనందుకు సరైన కారణం వివరించాలి. 

ఎక్కువ ఆదాయాన్ని తక్కువగా చూపించినట్టయితే చెల్లించాల్సిన పన్నులో 200 శాతం ట్యాక్స్ పడవచ్చు. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకుంటే ఇ ఫైలింగ్ పోర్టల్‌లో రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

Also read: AP Capital Issue: దసరా నాటికి విశాఖ నుంచి పాలన ప్రారంభం కానుందా, ప్రభుత్వం స్పష్టం చేసేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News