HRA Exemption Rules: ఐటీ రిటర్న్స్ పైల్ చేశారా, హెచ్ఆర్ఏ ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసా

HRA Exemption Rules: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. వేతన జీవులు వివిధ రకాలుగా ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హెచ్ఆర్ఏ సరైన ప్రత్యామ్నాయం. మరి హెచ్ఆర్ఏను ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 8, 2024, 05:49 PM IST
HRA Exemption Rules: ఐటీ రిటర్న్స్ పైల్ చేశారా, హెచ్ఆర్ఏ ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసా

HRA Exemption Rules: ఉద్యోగస్థులైన ట్యాక్స్ పేయర్లకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మంచి ప్రత్యామ్నాయం. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 10 (13A) ప్రకారం ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు వీలుంది. న్యూ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకున్నప్పుడు ట్యాక్స్ మినహాయింపు ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసేందుకు ఈ నెల 31 వరకూ గడువుంది. ట్యాక్స్ పేయర్ ఇన్వెస్ట్‌మెంట్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకోకపోతే ఆటోమేటిక్‌గా కొత్త ట్యాక్స్ రెజీమ్ వర్తిస్తుంది. అంటే హెచ్ఆర్ఏ, సెక్షన్ 80 సి డిడక్షన్ లెక్కించి ఉండవచ్చు. అయినా సరే రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు హెచ్ఆర్ఏ కింద మినహాయింపు పొందే అవకాశముంటుంది. హెచ్ఆర్ఏ క్లెయిమింగ్  నిబంధనలు ఇప్పటికే ఖరారై ఉన్నాయి. మెట్రోలో అయితే బేసిక్ శాలరీ నుంచి 50 శాతం, నాన్ మెట్రో అయితే బేసిక్ శాలరీ నుంచి 40 శాతం లేదా చెల్లిస్తున్న అద్దెలో ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేయవచ్చు. ఐటీ రిటర్న్స్ పైల్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే రెంటల్ అగ్రిమెంట్, రెంట్ రిసీప్టులు వెంట ఉంచుకోవాలి. హౌస్ రెంట్ నెలకు 50 వేలు దాటి చెల్లిస్తుంటే టీడీఎస్ డిడక్ట్ చేసి ఇవ్వచ్చు.

స్వయం ఉపాధి ట్యాక్స్ పేయర్లకైతే సెక్టన్ 10 (13ఎ) ప్రకారం హెచ్ఆర్ఏ మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80జిజి ప్రకారం ప్రతి నెలా 5 వేల రూపాయలు డడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. మీ మొత్తం ఆదాయంలో 25 శాతం , చెల్లించే అద్దెలో ఏది తక్కువైతే అది వర్తిస్తుంది. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంటే మాత్రం అద్దె చెల్లిస్తూ హెచ్ఆర్ఏ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. కానీ మీరు చెల్లించే అద్దె మీ తల్లిదండ్రుల ఆదాయంగా పరిగణిస్తారు. 

Also read: HIV Injection: ప్రాణాంతక హెచ్ఐవీకు ఇంజక్షన్ వచ్చేసింది, ట్రయల్స్ విజయవంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News