ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ నుంచి మీకు నోటీసులు వచ్చాయా..తక్షణం ఏం చేయాలి

ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. ప్రస్తుత స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. టీడీఎస్ రిఫండ్ కూడా ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ క్రమంలో మీకేమైనా నోటీసులు అందాయా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 18, 2022, 03:30 PM IST
 ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ నుంచి మీకు నోటీసులు వచ్చాయా..తక్షణం ఏం చేయాలి

ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. ప్రస్తుత స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. టీడీఎస్ రిఫండ్ కూడా ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ క్రమంలో మీకేమైనా నోటీసులు అందాయా..

ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఆఖరి తేదీ జూలై 31తో ముగిసింది. ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుతం రిటర్న్స్ స్క్రూటినీ చేస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో టీడీఎస్ కట్ అయినవారికి రిఫండ్ అందించే ప్రక్రియ కొనసాగుతోంది. కొంతమందికి ఈపాటికే అంది ఉంటుంది. కొంతమందికి మాత్రం ఇన్‌కంటాక్స్ శాఖ తరపున నోటీసులు అంది ఉంటాయి. మీకు అలాంటి నోటీసులు అందాయా..అలా జరిగి ఉంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఇన్‌కంటాక్స్ శాఖ ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సహాయంతో రిటర్న్స్ స్క్రూటినీ చేస్తోంది. ఈ ఆధారంగానే ట్యాక్స్ పేయర్లకు నోటీసులు అందుతున్నాయి. ఇన్‌కంటాక్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం..ఎవరైనా ఒకేసారి ఎక్కువ క్లెయిమ్స్ చేస్తే నోటీసులు అందించవచ్చు. ఈ క్రమంలో ట్యాక్స్ పేయర్లకు ఐటీఆర్ వెరిఫై చేయించుకోవాలి లేదా రివైజ్ చేసుకోవాలి. 

2 వందల శాతం జరిమానా

ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 జి ప్రకారం కొన్ని రకాల ఖర్చులపై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం చిన్న క్లెయిమ్స్ చేసే చిరు వ్యాపారులు లేదా ట్యాక్స్ పేయర్లకే ఎక్కువగా నోటీసులు అందుతున్నాయి. దానం చేసిన డబ్బు, ఛారిటబుల్ ఫండ్, రిలీఫ్ ఫండ్ దీనికందకు వస్తాయి. ఈ క్రమంలో వేతనజీవులు లేదా వ్యాపారవర్గాలు ఒకవేళ ట్యాక్స్ , ఆదాయం  తప్పుగా లెక్కకడితే ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు వస్తాయి. తప్పనితేలితే చట్టప్రకారం 200 శాతం వరకూ జరిమానా పడుతుంది. 

నోటీసులు వస్తే ఏం చేయాలి

మీకు ఒకవేళ ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందితే ముందుగా పెట్టుబడులుగా చూపించిన కాగితాలు సమర్పించాలి. ఈ డాక్యుమెంట్స్ ఆధారంగానే నోటీసులు అందిన 15 రోజుల్లోగా ఐటీఆర్ ఫైలింగ్ రివైజ్ చేయాల్సి ఉంటుంది. వేతనజీవులైతే ఫామ్ 16 సమర్పించాలి. ఐటీఆర్‌లో ఇచ్చిన అన్ని డిడక్షన్లకు ఫామ్ 26ఏఎస్ కూడా జత చేయాలి. టీడీఎస్ డబ్బులు ఫామ్ 16, ఫామ్ 26ఎఎస్ రెండూ ఒకేలా ఉండాలి. ఒకవేళ ఫామ్‌లో ఏదైనా తేడా కన్పిస్తే..మీరు పనిచేసే కంపెనీ నుంచి సరిచేసుకోవల్సి ఉంటుంది. 

Also read: Mileage Bikes: కేవలం లీటర్ పెట్రోల్‌కు 110 కిలో మీటర్ల మైలేజీని ఇచ్చే బైక్స్‌ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News