How to check ITR Refund Status: ట్యాక్స్ పేయర్స్‌కు జూలై 31వ తేదీ వరకు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవకాశం ఉంది. ఆదాయ పన్ను చెల్లించేందుకు తమ లెక్కల చిట్టాను బయటకు తీస్తున్నారు. ఇప్పటికే 2 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా దాఖలు చేయని వారు ఎవరైనా ఉంటే.. వెంటనే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి రెండు పన్ను విధానాలు ఉన్న విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో కానీ.. పాత పన్ను విధానంలో అయినా ట్యాక్స్ చెల్లించవచ్చు.
ఇప్పటికే మీరు రిటర్న్ ఫైల్ చేసి.. మీ ట్యాక్స్ రిటర్న్స్ స్టాటస్ చెక్ చేసుకోవాలని అనుకుంటే.. ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇతరులను అడిగేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని సింపుల్‌గా కంప్లీట్ చేసుకోండి. పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో శాఖ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద కూర్చొని వారి రీఫండ్ స్టాటస్‌ను నేరుగా చెక్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులు TIN-NSDL వెబ్‌సైట్ ద్వారా రీఫండ్ చెక్ చేసుకునే అవకాశం ఉంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్ తన పన్ను కంటే ఎక్కువ పన్నును డిపాజిట్ చేస్తే.. వాళ్లు రీఫండ్‌కు అర్హులు అవుతారు. రిటర్న్ కోసం దాఖలు చేసిన వారు.. రీఫండ్ స్టాటస్‌ను ఇలా చెక్ చేసుకోండి.
==> ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
==> ఇందులో కిందకి స్క్రోల్ చేయండి. మీకు 'యువర్ రీఫండ్ స్టేటస్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి.
==> ఆ తర్వాత మీరు పాన్ నంబర్, ఆర్థిక సంవత్సరం, అసెస్‌మెంట్ సంవత్సరాన్ని నమోదు చేయాలి.
==> మీ నంబరకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
==> వెంటనే రీఫండ్ స్టాటస్ డిస్‌ప్లేపై కనిపిస్తుంది.
==> ఐటీఆర్‌లో ఏదైనా సమస్య ఉంటే.. అప్పుడు స్క్రీన్‌పై 'రికార్డ్ నాట్ ఫౌండ్' అనే మెసేజ్ పంపిస్తుంది.
Also Read: SBI MCLR Price: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. వడ్డీ రేట్లు పెంపు
Also Read: Twitter Ads Revenue: ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్.. మాట నిలబెట్టుకున్న ఎలన్ మస్క్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి