Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా

Tax Free Incomes: ట్యాక్స్ పేయర్లు ఎప్పటికప్పుడు ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి కీలక విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎలాంటి ఆదాయంపై ట్యాక్స్ ఉంటుంది, ఎలాంటి వాటిపై ఆదాయం ఉండదనే విషయంపై అవగాహన తప్పకుండా ఉండాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2024, 08:13 AM IST
Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా

Tax Free Incomes: ఆదాయం అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని రకాల ఆదాయంపై ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదు. ముఖ్యంగా ఐదు రకాల ఆదాయాలపై ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరముండదు.  అందుకే ఇన్‌కంటాక్స్ శాఖకు ఆదాయం వివరాల గురించి కచ్చితమైన సమాచారం అందించాల్సి ఉంటుంది. తప్పుడు వివరాలు అందిస్తే ఇన్‌కంటాక్స్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. 

ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం అన్ని రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదు. కొన్నింటిపై ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. మరి కొన్నింటిపై ట్యాక్స్ ఉంటుంది. ముఖ్యంగా దేశంలో వ్యవసాయ ఆదాయంపై ట్యాక్స్ ఉండదు. వ్యవసాయంపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వ్యవసాయానికి సంబంధించిన వాణిజ్య పరిశ్రమలపై మాత్రం ట్యాక్స్ ఉంటుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలపై ట్యాక్స్ ఉంటుంది. 

ఇక పెళ్లి సందర్భంగా లేదా విల్ రూపంలో లేదా వారసత్వంగా వచ్చే ఆస్థులు లేదా ఆదాయంపై ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ లేకపోయినా పరిమితి మాత్రం విధించారు. ఇక పీపీఎఫ్, ఈపీఎఫ్ ఎక్కౌంట్లలో జమ అయ్యే వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతేకాకుండా షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్ పై వచ్చే డివిడెండ్లపై ట్యాక్స్ ఉండదు. 

ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంచుకున్న షేర్లను అమ్మకాలపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. స్వల్పకాలిక షేర్లపై కూడా ట్యాక్స్ ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా. 

మీ ఆదాయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇన్‌కంటాక్స్ శాఖకు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటుంది. సెక్షన్ 270 ఎ ప్రకారం తప్పుుడు సమాచారం ఇచ్చినట్టయితే 200 శాతం ట్యాక్స్ జరిమానా పడుతుంది. ఎంత నగదు దాచిపెట్టారో దానిపై 50 శాతం జరిమానా విదించినా విధించవచ్చు. 

ఆదాయ మార్గాలు, ఆదాయంపై తప్పుడు సమాచారం ఇచ్చినా లేక సరైన ఇన్వెస్ట్‌మెంట్ రికార్డులు సమర్పించకపోయినా, ప్రూఫ్స్ ఇవ్వకపోయినా, ఎక్కౌంట్ బుక్‌లో తప్పుడు ఎంట్రీలున్నా జరిమానా లేదా శిక్షకు బాధ్యులు. 

Also read: 10th Hall Tickets 2024: ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు నేటి నుంచే, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News