Hyundai Creta @ Rs 8 Lakhs: రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా కారు.. షో రూమ్ ముందు క్యూ కట్టిన జనాలు

Hyundai Creta Just Rs @ 8 Lakhs: కార్స్ 24 వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ క్రెటా కార్లు ఉన్నాయి. ఆ కార్లను 8 లక్షల లోపే కొనుగోలు చేయొచ్చు. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 22, 2023, 09:57 AM IST
  • 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా మీ సొంతం
  • రోడ్ టాక్స్ చెల్లించకుండానే ఇంటికి తీసుకెళ్లండి
  • తెలిసి ఎగబడిన జనాలు
Hyundai Creta @ Rs 8 Lakhs: రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా కారు.. షో రూమ్ ముందు క్యూ కట్టిన జనాలు

Buy Hyundai Creta Car only @ Rs 8 Lakhs: భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో 'హ్యుందాయ్ క్రెటా' ఒకటి. ఈ కారు హ్యుందాయ్ కంపెనీ యొక్క కాంపాక్ట్ ఎస్‌యూవీ. ముందుగా 2014లో మార్కెట్‌లోకి క్రెటా ప్రవేశపెట్టబడింది. కొత్త మోడల్ 2020లో వచ్చింది. స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ కారణంగా క్రెటా అమ్మకాలు ముందునుంచి బాగానే ఉన్నాయి. క్రెటా మూడు ఇంజన్ ఎంపికలలో (1.5-లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్) అందుబాటులో ఉంది. 

హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర 10.84 లక్షలుగా ఉంటుంది. ఇక టాప్ మోడల్ అయితే రూ. 19.13 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్రెటా కొత్త కారుకే కాదు.. సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారు సెకండ్ హ్యాండ్ కార్లను కొనాలని చుస్తున్నారు. కార్స్ 24 (Cars24) వెబ్‌సైట్‌లో ఉపయోగించిన క్రెటా కార్లు ఉన్నాయి. ఆ కార్లను 8 లక్షల లోపే కొనుగోలు చేయొచ్చు. పాత కారు కాబట్టి రోడ్ టాక్స్ చెల్లించకుండానే ఇంటికి తీసుకెళ్లొచ్చు. 

2016 Hyundai Creta 1.6 S MANUAL:

2016 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ. 7,95,000లుగా ఉంది. రెండవ యజమాని వద్ద ఉన్న ఈ కారు కేవలం 19798 కిలోమీటర్లు మాత్రమే నడిచింది. ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈ పెట్రోల్ ఇంజిన్ కారు నంబర్ ప్లేట్ DL-1Cతో ప్రారంభమవుతుంది.

2015 Hyundai Creta 1.6 S MANUAL:

2015 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ ధర రూ. 822000లుగా ఉంది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు 27,923 కిలోమీటర్లు ప్రయాణించింది. ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈ పెట్రోల్ ఇంజన్ కారు నంబర్ ప్లేట్ UP-32తో ప్రారంభమవుతుంది.

2018 Hyundai Creta 1.6 E + VTVT MANUAL:

2018 హ్యుందాయ్ క్రెటా 1.6 E + VTVT మాన్యువల్ ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ. 871000లుగా ఉంది. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. రీడింగ్ 64,849 కిలోమీటర్లు. ఢిల్లీలో అమ్మకానికి ఉన్న ఈ పెట్రోల్ ఇంజిన్ కారు నంబర్ ప్లేట్ DL-5Cతో ప్రారంభమవుతుంది.

2018 Hyundai Creta 1.6 E + VTVT MANUAL:

మరో 2018 హ్యుందాయ్ క్రెటా 1.6 E + VTVT మాన్యువల్ ధర రూ. 790000లుగా ఉంది. ఇది కూడా మొదటి యజమాని కారు. ఈ కారు మొత్తం 80,985 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇందులో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. కారు నంబర్ UP-14తో ప్రారంభమవుతుంది. ఇది ఢిల్లీలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

Also Read: Shama Sikander Bikini Pics: బికినీలో షామా సికిందర్ భారీ అందాలు.. మొత్తం విప్పి చూపించేసిందిగా! పిచ్చెక్కిపోతున్న కుర్రకారు   

Also Read: Man Kiss King Cobra Video: ఇదేం ఫాంటసీరా బాబు.. లవర్ కి పెట్టినట్టు కింగ్ కోబ్రాకి ముద్దు పెట్టేసాడు.. మెంటలెక్కిస్తున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News