New Hyundai Creta Matte Black Alpha Edition: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హ్యుందాయ్ త్వరలోనే మరో కొత్త గుడ్ న్యూస్ తెలపబోతోంది. గతంలో మార్కెట్‌లోకి లాంచ్ అయిన క్రెటా మోడల్‌ను కొత్త ఎడిషన్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో ఇది ఒకటి. భారత మార్కెట్‌లో ఈ SUVకి మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకునే కొత్త ఎడిషన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ తమ క్రెటాను ఆల్ఫా ఎడిషన్ 2024 వేరియంట్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ కారులో వస్తున్న ఫీచర్స్ ఏంటో వాటికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెటా బ్లాక్ మ్యాట్ ఆల్ఫా ఎక్సటర్నల్ ఫీచర్స్:
త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ కాబోయే క్రెటా బ్లాక్ మ్యాట్ ఆల్ఫా ఎడిషన్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఎడిషన్‌లో అల్లాయ్ వీల్స్, సైడ్ కాంట్రాస్టింగ్ వంటి ఫీచర్స్‌లో మార్పులు రాబోతున్నాయి. దీంతో పాటు అప్లిక్, సి-పిల్లర్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా ఫీచర్స్‌లో కూడా అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రూఫ్ స్పాయిలర్ కింది భాగంలో గ్లోస్ బ్లాక్ షేడ్స్ కూడా లభిస్తాయి. దీంతో పాటు ఇది ఆకర్షణీయమైన మాట్ బ్లాక్ షేడ్‌ను కూడా అందుబాటులో ఉంది. ఈ కారు స్పోర్టీ లుక్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది రెండు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
క్రెటా బ్లాక్ మ్యాట్ ఆల్ఫా ఇంటీరియర్:
ఇక ఈ కొత్త ఎడిషన్ ఇంటీరియర్ విషయానికొస్తే, ఇది పూర్తిగా ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్లాక్ డ్యాష్‌బోర్డ్, బ్లాక్ డోర్ ప్యానెల్‌లను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బ్లాక్ అప్హోల్స్టరీను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ కారులోని సీట్లు మొత్తం రెడ్ కలర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లోపలి భాగంలో కూడా స్పోర్టీ టచ్‌ని కలిగి ఉంటుంది. ఇక క్రెటా ఆల్ఫా ఎడిషన్ వివరాల్లోకి వెళితే, ఇందులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఇవే కాకుండా అనేక ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
క్రెటా బ్లాక్ మ్యాట్ ఆల్ఫా ఎడిషన్ యొక్క టాప్ 10 ఫీచర్స్:
1. ప్రత్యేకమైన బ్లాక్ మ్యాట్ ఎక్స్టీరియర్
2. డ్యూయల్-టోన్ ఇంటీరియర్
3. సన్‌రూఫ్
4. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
5. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్
6. JBL ఆడియో సిస్టమ్
7. 360-డిగ్రీ కెమెరా
8. హెడ్స్-అప్ డిస్‌ప్లే
9. అడపటివ్ క్రూయిజ్ కంట్రోల్
10. ఎయిర్ ప్యూరిఫైయర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి