Credit Cards Usage: క్రెడిట్ కార్డులతో కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

Credit Cards Usage Benefits and Tips: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి సకాలంలో బిల్లు చెల్లిస్తేనే అది మీకు మేలు అవుతుంది. లేదంటే బ్యాంకులు మీరు చెల్లించాల్సిన మొత్తంపై 5 శాతం నుండి 7 శాతం వరకు వడ్డీ వసూలు చేయడంతో పాటు ఆలస్య రుసుం కూడా వసూలు చేస్తారు. అన్నింటికిమించి మీ సిబిల్ స్కోర్ కూడా డ్యామేజ్ అవుతుంది.

Written by - Pavan | Last Updated : Aug 8, 2023, 09:06 PM IST
Credit Cards Usage: క్రెడిట్ కార్డులతో కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

Credit Cards Usage Benefits and Tips : కొన్ని క్రెడిట్ కార్డులు కొన్ని స్పెసిఫిక్ ఆర్డర్స్‌పై కనీసం 2 శాతం నుండి 3 లేదా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తుంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ కొనుగోలుపై గరిష్టంగా 10 శాతం వరకు ఆఫర్స్ అందిస్తుంటాయి. అలాంటి అవకాశాలు అందిపుచ్చుకుంటే ఆర్థిక ప్రయోజనం చేకూరినట్టే. అయితే, ఇలాంటి ఆఫర్స్ లిమిటెడ్ పీరియడ్ లేదా లిమిటెడ్ ఆఫర్ ఉంటాయి అనే విషయం మర్చిపోవద్దు.

మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వాళ్లకు క్రెడిట్ కార్డ్స్ ఈజీగా అప్రూవ్ చేసి ఇస్తుంటారు. అదే సమయంలో కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై కార్డు జారీ అయిన తొలి రోజుల్లో బ్యాంకు నిర్ధేశించిన మొత్తాన్ని వాడుకున్నట్టయితే, యాన్వల్ ఫీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. 

క్రెడిట్ కార్డుతో ఒక సేఫ్టీ ఫీచర్ కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించే పేమెంట్స్ చేసినప్పుడు కొంతమేరకు ఫ్రాడ్ జరగకుండా సేఫ్టీ ఉండే అవకాశాలు ఉంటాయి. డెబిట్ కార్డుతో పేమెంట్ విషయానికొస్తే.. ఏదైనా ఫ్రాడ్ జరిగితే... ఖాతాలోని మొత్తం ఒకేసారి పోయే ప్రమాదం ఉంటుంది.

క్రెడిట్ కార్డులు ఉపయోగించి చేసే పేమెంట్స్‌పై రివార్డ్స్ పాయింట్స్ లభిస్తుంటాయి. ప్రత్యేకించి రెస్టారెంట్స్, గ్రాసరీస్, గ్యాస్ వంటి అవసరాలకు కార్డులను ఉపయోగించినప్పుడు బ్యాంకులు ఎక్కువ రివార్డ్స్ పాయింట్స్ ఇస్తుంటాయి. ఆ రివార్డ్స్ పాయింట్స్‌ని మీరు మరొక చోట రెడీమ్ చేసుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. 

మీరు డెబిట్ కార్డు ఉపయోగించి ఏదైనా పేమెంట్ చేసినట్టయితే.. వెంటనే మీ ఖాతాలోంచి డబ్బులు కట్ అవుతాయి. కానీ క్రెడిట్ కార్డు విషయంలో అలా కాదు. మీకు మీ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ అయ్యే తేదీనిబట్టి నాలుగైదు వారాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆలోగా మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. అప్పటివరకు బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఇతర అత్యవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా.. లేదా మీ సిబిల్ స్కోర్ బాగా తగ్గినా.. మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి, మీరు బిల్లు చెల్లించాల్సిన గడువు రాకముందే సకాలంలో బిల్లు చెల్లిస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ మెరుగు పడుతుంది. 

మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి సకాలంలో బిల్లు చెల్లిస్తేనే అది మీకు మేలు అవుతుంది. లేదంటే బ్యాంకులు మీరు చెల్లించాల్సిన మొత్తంపై 5 శాతం నుండి 7 శాతం వరకు వడ్డీ వసూలు చేయడంతో పాటు ఆలస్య రుసుం కూడా వసూలు చేస్తారు. అన్నింటికిమించి మీ సిబిల్ స్కోర్ కూడా డ్యామేజ్ అవుతుంది.

Trending News