Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డు జారీ చేసినప్పుడు తీసుకున్న ఫోటో మీకు నచ్చలేదా ? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డుపై మీ ఫోటోను మార్చుకోవచ్చని మీకు తెలుసా ? అవును.. ఆధార్ కార్డుపై ఫోటో మార్చే అవకాశం ఉంది గురూ.. మీకు సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డుపై ఫోటో చేంజ్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్ ఫోటో మార్చుకోవడం ఎలా అంటే..
ఆధార్ కార్డుపై ఫోటోగ్రాఫ్ అప్‌డేట్ చేసుకోవడానికి ముందుగా మీరు మీకు సమీపంలో ఉన్న ఆధార్ శాశ్వత నమోదు కేంద్రం విజిట్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ నమోదు ఫారంలో వివరాలు నింపి, ఫారంను ఆధార్ నమోదు కేంద్రంలో అందించి బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
అదే సమయంలో ఆధార్ కేంద్రంలో ఉన్న సిబ్బంది డిజిటల్ కెమెరా ద్వారా మీ ఫోటో తీసుకుంటారు.
బయోమెట్రిక్ వివరాల సబ్మిట్ చేసి మీ అప్లికేషన్‌ని ధృవీకరించాల్సి ఉంటుంది.
ఆధార్‌లోని బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి రూ.100 సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లించడంతో అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో రసీదు ఇస్తారు.
మీరు URN నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత అప్‌డేటెడ్ ఆధార్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 1: ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లో https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html ఈ పేజీని సందర్శించండి.
స్టెప్ 2: 'డౌన్‌లోడ్ ఆధార్'పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆధార్ నంబర్, రిజిస్టర్ ఐడి లేదా వర్చువల్ ఐడిని నమోదు చేయండి.
స్టెప్ 4: కింద ఇచ్చిన క్యాప్చాను ఎంటర్ చేసి, ఓటిపి సెండ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఆ తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటిపిని నమోదు చేయండి.
స్టెప్ 6: ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఆ తరువాతి పేజీలో ఉన్న స్టెప్స్‌ని అనుసరించండి. మీకు ఇక్కడే ఆధార్ కార్డును ప్రింట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఆధార్ నమదు కేంద్రం వద్ద తప్పించి నేరుగా మీకు మీరుగా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి వీల్లేదు.
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?