HDFC Bank FD rates: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు పెంపు- కొత్త వడ్డీ రేట్లు ఇవే!

HDFC Bank FD rates: ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు ఈ నెల ఆరంభం నుంచే అమలులోకి వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 09:02 AM IST
  • ఫిక్స్​డ్ డిపాజిట్ల వడ్డీ రేటు పెంచిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​
  • ఎఫ్​డీపై సీనియర్​ సిటిజన్లకు అదనంగా 25 బేసిస్​ పాయింట్ల వడ్డీ​
  • ఇటీవలే వడ్డీ రేట్లు సవరించిన ఐసీఐసీఐ బ్యాంక్
HDFC Bank FD rates: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు పెంపు- కొత్త వడ్డీ రేట్లు ఇవే!

HDFC Bank has increased the interest rates on FDs: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కస్టమర్లకు గుడ్​ న్యూస్ చెప్పింది. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై (ఎఫ్​)లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం (HDFC Bank increases interest rate) తీసుకుంది.

క్రితంతో పోలిస్తే దాదాపు 10 బేసిస్​ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్. పెంచిన వడ్డీ రేట్లు డిసెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం రన్ అవుతున్న వివిధ కాలపరిమతులతో కూడిన ఎఫ్​డీలకు పెంచిన వడ్డీ రేట్లు (HDFC Bank FDs interest rates) వర్తించనున్నట్లు తెలిపింది బ్యాంక్.

కొత్త వడ్డీ రేట్లు ఇలా..

36 నెలల మెచ్యూరిటీ పీరియడ్​ ఉన్న ఎఫ్​డీలపై ప్రస్తుతం 6.05 శాతం వడ్డీ లభిస్తుండగా.. ఇకపై 6.1 శాతం వడ్డీ (New Interest rate of HDFC bank) లభించనుంది.

60 నెలల మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్ల వడ్డీ రేటు.. 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్.

సీనియర్​ సిటిజన్లకు అదిరే ఆఫర్​..

కొత్తగా తమ బ్యాంక్​లో ఫిక్స్​డ్ డిపాజిట్​ చేయాలనుకున్న సీనియర్​ సిటిజన్లకు అదిరే ఆఫర్ ప్రకటించింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్. సాధారణ ఎఫ్​డీలతో పోలిస్తే వీరికి 25 బేసిస్​ పాయింట్ల వడ్డీ అధనంగా చెల్లించే ఆఫర్​ను (HDFC Bank offer for  senior citizens) కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

ఐసీఐసీఐ ఎఫ్​డీపై కొత్త వడ్డీ రేట్లు..

ప్రైవేటు రంగానికి చెందిన మరో దిగ్గజ బ్యాంక్​.. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఎఫ్​డీ వడ్డీ రేట్లను ఇటీవల (ICICI Bank revised interest rates) సవరించింది.

7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితితో చేసే ఫిక్స్​డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లను అమలులోకి తెచ్చింది. అయితే సవరించిన వడ్డీ రేట్లు కొత్తగా ఎఫ్​డీ ఖాతా ఓపెన్​ చేసే వారికి, రెన్యువల్స్​కు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ (ICICI Bank FD interest rates) స్పష్టం చేసింది.

7 రోజుల ఫిక్స్​డ్​ డిపాజిట్​పై సాధారణ భారతీయ పౌరులకు రూ.2 కోట్ల లోపు చేసే ఫిక్స్​డ్​ డిపాజిట్​పై 2.50 శాతం వడ్డీ ఇస్తున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. అదే సీనియర్​ సిటిజన్స్​కు అయితే వడ్డీ 3 శాతంగా ఉంచింది.

ఇదే కాల పరిమితితో రూ.2 కోట్లకుపైన చేసే ఫిక్స్​డ్ డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీని (సీనియర్​ సిటిజన్స్​కు కూడా) చెల్లిస్తున్నట్లు పేర్కొంది.

5 ఏళ్లకు పైగా చేసే రూ.2కోట్ల లోపు ఎఫ్​డీలపై వడ్డీ రేటును సాధారణ ఖాతాదారులకు 5.35 శాతం, సీనియర్ సిటిజన్స్​కు 5.85 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది ఐసీఐసీఐ బ్యాంక్.

Also read: Gold Price Today: బంగారం ధర తగ్గుముఖం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Also read: GST Collection November 2021: జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.31 లక్షల కోట్ల ఆదాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News