Bank Salary Hike: బ్యాంక్ ఉద్యోగులకు జాక్‌పాట్ వచ్చేసింది. ఈసారి భారీగా జీతాలు పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని భారీగా పెంచడానికి భారత బ్యాంకుల సంఘం (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-ఐబీఏ), బ్యాంక్ ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. 17 శాతం జీతం పెంచే ప్రతిపాదనకు శుక్రవారం బ్యాంకు సంఘాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. తాజాగా పెరగనున్న జీతాలపై బ్యాంకులపై ఏడాదికి రూ.8,284 కోట్ల భారం పడనుంది. 2022 నవంబర్ నుంచి అమలయ్యేలా ఈ పెంపు ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ తెలిపింది.
దీంతోపాటు వారంలో రెండు రోజుల సెలవు అంశంపై కూడా కదలిక వచ్చింది. బ్యాంకులు వారానికి 5 రోజులే పని చేసేలా, అన్ని శనివారాలను సెలవుగా పరిగణించడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ అంగీకరించింది. అయితే ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతోపాటు మహిళలకు ఒక శుభవార్త వినిపించారు. మహిళా ఉద్యోగులు నెలలో ఒకరోజు సిక్ లీవ్‌ను తీసుకోవచ్చు. అయితే మునుపటిలా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు.
Also Read: Vijay Sekhar Sharma: మరింత ముదిరిన 'పేటీఎం సంక్షోభం'.. చైర్మన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా
- కొత్త డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. కొత్త వేతన ఒప్పందం ప్రకారం 8088 పాయింట్ల డీఏను, ఆపై వచ్చిన దానిని విలీనపర్చిన తర్వాత కొత్త పే స్కేళ్లను నిర్ణయించారు.
- రిటైర్‌మెంట్ లేదా సర్వీసులో ఉండగా మరణిస్తే ఆ సమయానికి 255 రోజుల వరకు ప్రి విలేజ్ లీవ్‌లను నగదుగా తీసుకోవచ్చు.
- రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తున్న పింఛన్/ ఫ్యామిలీ పింఛన్‌కు అదనంగా మంత్లీ ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని చెల్లిస్తారు.
వేతన ఒప్పందంపై పీఎస్‌యూ బ్యాంకు యాజమాన్యాల అసోసియేషన్ (ఐబీఏ), ఉద్యోగుల యూనియన్లు, యూఎఫ్‌బీయూ, ఏఐబీఓఏ, ఏఐబీఏఎస్‌ఎం, బీకేఎస్‌ఎంలు సంతకాలు చేశాయని ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సునీల్ మోహతా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter