Internet Speed: వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఇక 4G వేగంతో  ఇంటర్నెట్

BSNL Latest News | టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి పొందిన బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సేవల్ని తమ వినియోగదారులకు అందిస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) వినియోగదారులకు శుభవార్త అందించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 31, 2021, 09:46 AM IST
Internet Speed: వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఇక 4G వేగంతో  ఇంటర్నెట్

ప్రభుత్వ రంగంలోని టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) వినియోగదారులకు శుభవార్త అందించింది. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి పొందిన బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సేవల్ని తమ వినియోగదారులకు అందిస్తున్నామని ప్రకటించింది. 

హైబ్రిడ్ 4జీ రోల్ ఔట్ ప్లాన్ ద్వారా తమ వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ తీవ్రంగా శ్రమిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేవలం 3జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలంటే BSNL 4జీ సేవలు అవసరమని బీఎస్ఎన్ఎస్ భావిస్తోంది. రెండు దశలలో ఖాతాదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ తీసుకురానుంది. తొలి దశలో మొత్తం 50000 ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించనుంది.

Also Read: Gold Price Today 31 March 2021: మార్కెట్‌లో మళ్లీ పతనమైన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

మరో 50000 ప్రాంతాలకు అంతర్జాతీయ వెండర్స్ అయిన ఎరిక్‌సన్, నోకియా, తదితర కంపెనీల నెట్‌వర్క్ సాయంతో 4జీ ఇంటర్నెట్ సేవల్ని బీఎస్ఎన్ఎల్(BSNL Recharge Offers) అందించనుంది. ప్రైవేట్ నెట్‌వర్క్ సంస్థలు ఇదివరకే 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురాగా, రేసులో ముందుకు సాగాలంటే వేగాన్ని పెంచక తప్పదని ప్రభుత్వ రంగ ఆధీనంలోని బీఎస్ఎన్ఎల్ కీలక అడుగు వేయనుంది.

విదేశీ వెండర్స్‌కు ఇవ్వాలనుకున్న ప్రాంతాలకుగాూ భారత కంపెనీలు సైతం టెండర్లలో పాల్గొనున్నాయి. నిర్ణీత సమయంలో భారత కంపెనీలు ట్రయల్స్ పూర్తి చేయగలిగితే వారికే టెండర్ దక్కనుంది. ప్రైవేట్ నెట్‌వర్క్‌ కంపెనీలలతో పోటీపడి మరి బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ఆఫర్లను అందిస్తోంది. రీఛార్జ్ ప్లాన్లతో పాటు ఇంటర్నెట్ వేగాన్ని పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 31, 2021, ఓ రాశివారికి ధనవ్యయం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News