Todays Gold Price: నిలకడగా బంగారం, దేశంలో వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Price: బంగారం ధర కాస్త నిలకడగా ఉంది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2022, 07:14 AM IST
Todays Gold Price: నిలకడగా బంగారం, దేశంలో వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Price: బంగారం ధర కాస్త నిలకడగా ఉంది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త. బంగారం ధరలో ఏ మార్పు లేక స్థిరంగా ఉంది. బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేటు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ వంటి వివిధ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Price) 10 గ్రాముల ధ‌ర 46 వేల 760 రూపాయలుగా ఉంది.  అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 51 వేల 10 రూపాయలుగా ఉంది. అదే విధంగా కిలో వెండి 60 వేల7 వందల రూపాయలుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 610 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 48 వేల 610 రూపాయలుంది. అటు వెండి కిలో 60 వేల 7 వందల రూపాయలు పలుకుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 860 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 49 వేల 560 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 44 వేల 610 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 48 వేల 660 రూపాయలుంది. కిలో వెండి ధర 60 వేల 7 వందల రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధర కర్ణాటక రాజధాని బెంగళూరుతో సమానంగా ఉంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Price)10 గ్రాముల ధ‌ర 44 వేల 610 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 48 వేల 660 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 610 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 660 రూపాయలుంది. 

Also read: Bad news: గృహోపకరణాల ధరలకు రెక్కలు.. ఎంత శాతం పెరుగుతాయో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News