Gold Price Update Today: చాలా రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వారంలో నాలుగవ రోజు కావడంతో పలు ప్రాంతాల్లో బంగారంకి సంబంధించి రోజువారి ధరలను విడుదల చేశారు. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ. 41 పెరిగింది. అయితే మొన్న ఒక్క సారిగా బంగారం ధరలు తగ్గడంతో ఈ రోజు ధరలో స్వల్ప మార్పులు కారణంగా పెరిగింది. అయితే ఈ క్రమంలో వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.90 వరకు తగ్గింది. ఈ రోజు 10 గ్రాములు బంగారం ధర రూ. 56,300 ఉండగా కిలో వెండి ధర రూ. 62,000లుగా ఉంది.
గురువారం బంగారం ధరల్లో స్వల్ప మార్పులు వచ్చాయి. 10 గ్రాములకు రూ.41 పెరిగి ధర రూ.56,286తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. చివరి ట్రేడింగ్ రోజు (బుధవారం) బంగారం ధర 10 గ్రాములకు రూ.844 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.55,245 వద్ద ముగిసింది. ఇక ఈ రోజు ధర విషయానికొస్తే బంగారం ధర పెరగడంతో, వెండి ధర తగ్గింది. బుధవారం కిలో వెండి ధర రూ.2383 తగ్గి రూ.61,883లకి లభించింది.
క్యారెట్లవారిగా బంగారం ధరలు:
ఈ రోజు బంగారం పెరగడంతో ధరల్లో పలు మార్పులు వచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.41 పెరిగి రూ.55,286గా ఉంది. 23 క్యారెట్ల బంగారం రూ.41 పెరిగి రూ.55,065, 22 క్యారెట్ల బంగారం రూ.33 పెరిగి రూ.50,637, 18 క్యారెట్ల బంగారం రూ.31 పెరిగి రూ.41465గా, 14 క్యారెట్ల బంగారం ధర రూ. 10 గ్రాముల ధర రూ. 32342లుగా భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు తగ్గింపు:
ఈ సంవత్సరంలో బంగారం ధరలు ఇంత తగ్గడం ఆల్ టైమ్ రికార్డుగా చెప్పొచ్చు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3596 దాకా తగ్గింది. ఫిబ్రవరి 2, 2022లో బంగారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరి ఒక్కసారిగా తగ్గిడంతో పసిడి కొనుగోలు చేసి కస్టమర్లు ఒక్కసారిగా ఊపిరిపిల్చుకున్నారు. ఫిబ్రవరి 2న పది గ్రాముల బంగారం ధర రూ.58,882 వరకు చేరింది. కిలో వెండి ధర రూ. 18,197 దాకా పెరిగి..రూ.79980లకి విక్రయించారు.
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook